ఆకలితో ఉన్నారా 040- 21111111కు ఫోన్ చేయండి..

Google+ Pinterest LinkedIn Tumblr +


ఆకలిగా ఉన్నవారు, భోజనం కావాల్సిన వారు, హైదరాబాద్‌ నగర పరిధిలో జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కాల్‌ సెంటర్‌ నంబరుకు ఫోన్ చేయాలని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్పారు.

అన్నార్థుల కోసం జీహెచ్ఎంసీ 040- 21111111 ఫోన్‌ నెంబరును ఏర్పాటు చేసిందని  ఆమె ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ నెంబరు గురించి అందరికీ తెలిసేలా చేయాలని హ్యాష్‌ ట్యాగ్‌తో #040-21111111 అని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. హైదరాబాద్ నగరంలో ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదనే సంకల్పంతో జీహెచ్ఎంసీ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని , ఈ నెంబరును ఎక్కువ ప్రాచుర్యంలోకి తేవాలని కవిత సూచించారు.

 జీహెచ్‌ఎంసీతోపాటు 9 కార్పొరేషన్లలో ముఖ్యంగా ఈ లాక్ డౌన్ సమయంలో 300 అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా రోజు 2 లక్షల మందికి ,రెండు పూటలా భోజనం పెడుతున్నట్లుగా, ఉన్నతాధికారులు తెలిపారు.  ఈ కేంద్రాల్లో ఉదయం 10.30 గంటలకు, సాయంత్రం 5 గంటలకు భోజనం అందించేలా వేళలు కూడా మార్చామన్నారు.

వంటశాలల విశిష్టతలు

* అక్షయపాత్ర వంటశాలల నుండి 150 కేంద్రాలకు భోజనం
సరఫరా అవుతుంది.

* ఉదయం 5 గంటలకు ఆహారం సిద్ధమై కంటైనర్స్‌లో
40 వాహనాల్లో ఆయా ప్రాంతాలకు చేరుస్తారు.

* గంటలో అరవై వేల మందికి భోజనం తయారు చేసే సాంకేతికత.
* రోజూ 40వేల మందికి రూ.5ల భోజనం తయారు.
* నాలుగు ప్రభుత్వ హాస్టల్స్‌తో సహా 20వేల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నిత్యం సరఫరా.

పేదోడి ఆకలికి సర్కారు అండ

ఐదు రూపాయలకే అన్నం కార్యక్రమం హైదరాబాద్‌లో 2014లో కేవలం 8కేంద్రాలలో ప్రారంభమైంది. క్రమంగా ఇపుడు జీహెచ్‌ఎంసీ పరిధిలో 150 కేంద్రాలకు విస్తరించి, ప్రతిరోజూ 25వేల మందికి స్వచ్ఛమైన, పరిశుభ్రమైన ఆహారం అందుతోంది. లబ్దిదారుల నుండి రూ.5మాత్రమే వసూలు చేయగా మిగతా ఖర్చంతా తెలంగాణ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ ద్వారా భరిస్తోంది. వంటశాల నిర్వహణ అంతా హరేకృష్ణ సంస్థ(అక్షయపాత్ర) పర్యవేక్షిస్తోంది. అక్షయ పాత్ర ఉచిత ఆహారం ఎలా తయారు చేస్తున్నారో ఈ Video లో …https://youtu.be/Lm1p0tA6hgo చూడండి.

శ్యాంమోహన్

Share.

Leave A Reply