ఈ చట్టాలు , రైతులకు చుట్టాలు కాదు !!

Google+ Pinterest LinkedIn Tumblr +

కేంద్ర ప్రభుత్వానికి పది మంది ఆర్థికవేత్తల   లేఖ

 రైతు ఆర్థిక పరిస్థితుల ను మెరుగు పరచడానికే చట్టాలు   తెచ్చామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ…చిన్న, సన్నకారు రైతుల  ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న మూడు చట్టాలను రద్దు చేయాలని, దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన 10 మంది  ఆర్థికశాస్త్ర  ప్రొఫెసర్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ కు లేఖ రాశారు.

 ఈ చట్టాలు ఎంత ప్రమాదం? అవి  ఎందుకు రద్దు చేయాలో వివరిస్తూ.. 5 ప్రధాన అంశాలను ఈ ఆర్దిక వేత్తలు  ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు.

1, రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ

రాష్ట్రాల  చేతుల్లో ఉన్న వ్యవసాయ మార్కెట్ల నియంత్రణాధికారాన్ని తీసివేస్తూ,  కేంద్రం కొత్త చట్టం చేయడం తప్పు.

 గ్రామస్థాయిల్లో రైతులకు జవాబుదారీగా అందుబాటులో ఉండేది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమే తప్ప కేంద్రం కాదు.  వ్యవసాయ మార్కెట్‌ యార్డులను రాష్ట్రాలు నియంత్రించడమే మంచిది . ధరల ను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నియంత్రించే స్థాయి రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుంది కానీ, అన్నింటికే ఒకే విధానాన్ని అవ లంబించే  కేంద్ర చట్టం ద్వారా ఏమాత్రం ప్రయోజనం ఉండదు.

2,  రైతులను దోపిడీ చేయడానికి అవకాశం

కొత్త చట్టం కింద రెండు మార్కెట్లు, రెండు నిబంధనలు ఉంటాయి. ఒకవైపు ఏమాత్రం నియంత్రణ  లేని ప్రైవేటు వ్యవస్థ, మరోవైపు నియంత్రణల మధ్య నడిచే ఏపీఎంసీ మార్కెట్‌ యార్డులు ఉంటాయి. భిన్న చట్టాలు, భిన్న మార్కెట్‌ ధరలు అమలవుతాయి.  ఒకవేళ ఏపీఎంసీ మార్కెట్లలో అధికారులు, వ్యాపారుల మధ్య లోపాయికారీ ఒప్పందాలు జరగడమే ప్రధాన సమస్య అయితే అదే పరిస్థితి బయటి ప్రైవేటు మార్కెట్‌లోనూ కనిపించడం ఖాయం. ఇలాంటి మోసాలను అరికట్టడానికి ఏపీఎంసీ మార్కెట్లలో అధికార యంత్రాంగం ఉంది. ప్రైవేటు మార్కెట్లలో అలాంటి వ్యవస్థ ఏదీ ఉండదు. దాని వల్ల ధరల తో పాటు, తూకాలు, గ్రేడింగ్  విషయాల్లో రైతులు దోపిడీకి గురయ్యే అవకాశం ఉంటుంది.

3, రైతుల బేరసారాల శక్తి తగ్గిపోతుంది

ఈ చట్టాలు రాకముందే, వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు ఏపీఎంసీ మార్కెట్‌ యార్డుల బయటే సాగుతున్నాయి. అయినప్పటికీ రోజువారీ  మార్కెట్‌ యార్డులు ధరలను డిసైడ్‌ చేసి, రైతులకు నమ్మకమైన ధరలను సూచిస్తున్నాయి.

  ప్రైవేటు వ్యాపారులు   ఎక్కడికక్కడ వ్యాపారాలు   నిర్వహించడం వల్ల   అక్కడ మార్కెట్‌ వాతావరణం ఉండదు. దాని వల్ల మార్కెట్‌ పూర్తిగా విచ్ఛిన్నమై గుత్తాధిపత్యానికి దారితీస్తుంది. 2006లో బిహార్‌ ప్రభుత్వం ఏపీఎంసీ చట్టాన్ని రద్దుచేసిన తర్వాత అక్కడ వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసే వ్యాపారులు లేక రైతుల బేరసారాల శక్తి తగ్గిపోయింది. దానితో ఇతర రాష్ట్రాల కంటే అతితక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వస్తోంది.

4, కాంట్రాక్టు సాగు,ఎవరికి బాగు?

 ఈ కొత్త బిల్‌లో కాంట్రాక్ట్‌ వ్యవసాయ చట్టం భాగస్వాముల మధ్య విపరీతమైన అసమానతలు  కల్పిస్తోంది. ఓవైపు చిన్న రైతులు, మరోవైపు  బడా కంపెనీలు ఉంటాయి. ఇక్కడ రైతుల   ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన వ్యవస్థ లేదు. ఈ చట్టం ద్వారా భూమి లీజు నిబంధనలను సరళీకరించడంతో కార్పొరేట్‌ సంస్థలు భారీమొత్తంలో లీజుకు తీసుకొని కాంట్రాక్ట్‌ వ్యవసాయం చేయడానికి వీలవుతోంది. ఒకవైపు కాంట్రాక్ట్‌ వ్యవసాయం స్వచ్ఛందమని చెబుతున్నా, మరోవైపు వ్యవసాయాన్ని గిట్టుబాటు కాకుండా చేసి రైతులను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెడితే వారు విధిలేని పరిస్థితుల్లో ఈ వ్యవస్థలోకి రాక తప్పని పరిస్థితి నెలకొంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతుల ప్రయోజనాలకు రక్షణ లేకపోతే ఈ చట్టంతో  నష్టమే ఎక్కువ.

5,  ‘గెట్‌ బిగ్‌ ..ఆర్‌ గెటవుట్‌’

స్ధానిక ప్రభుత్వాల నియంత్రణలు  ,  పరిమితులు, మార్కెట్‌ ఆంక్ష లు నుంచి వ్యాపార సంస్థలకు విముక్తి కల్పించడం వల్ల  మార్కెట్‌ మొత్తం  పెద్ద సంస్థల చేతుల్లోకి పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఐరోపాలో ఇలాంటి పరిస్థితి నెలకొంది. అది అంతిమంగా ‘గెట్‌ బిగ్‌ ఆర్‌ గెటవుట్‌’ అన్న పరిస్థితికి దారితీస్తుంది. వ్యవసాయ వ్యాపారం నుంచి చిన్న రైతులను  బయటికి నెట్టేస్తుంది. దీనికి బదులు భారతీయ రైతుల బేరసారాల శక్తిని పెంచే వ్యవస్థ కావాలి. మార్కెట్‌ లో వారి భాగస్వామ్యాన్ని పెంచాలి. ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌, మౌలిక వసతులను రైతులు, వ్యవసాయ ఉత్పత్తి సంఘాల  చేతుల్లో పెట్టాలి. అప్పుడే భారత వ్యవసాయ రంగంలో  ఆదాయం పెరుగుతుంది.

 ఈ  లేఖపై సంతకాు చేసిన వారిలో  టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌లో నాబార్డ్‌ ఛైర్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.రామకుమార్‌ , హైదరాబాద్‌ యూనివర్సిటీ రిటైర్డ్‌ ఎకనమిక్‌ ప్రొఫెసర్‌ డి.నరసింహారెడ్డితో పాటు… Prof. Kamal Nayan Kabra (retired), formerly of the Indian Institute of Public Administration and the Institute of Social Sciences, New Delhi, Prof. K.N. Harilal, professor  at Centre for Development Studies, Thiruvananthapuram,  Prof. Rajinder Chaudhary, former professor at M.D. University, Rohtak,  Prof. Surinder Kumar of CRRID, Chandigarh,  Prof. Arun Kumar, Malcolm S. Adiseshiah Chair Professor at the Institute of Social Sciences, New Delhi, Prof. Ranjit Singh Ghuman, professor of eminence at Guru Nanak Dev University, Amritsar, and professor of economics at CRRID, Chandigarh,  Vikas Rawal and Himanshu, both associate professors of economics at the Centre for Economic Studies and Planning (CESP), Jawaharlal Nehru University, New Delhi. ఉన్నారు.

(Source- the print.in )

Share.

Leave A Reply