21వ శతాబ్ది మీడియా

Google+ Pinterest LinkedIn Tumblr +

మీడియా నేడు ఎంతగా విస్తరించుకొన్నదో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. నట్టింట్లో నెట్టింట్లో దాని నర్తనం అమోఘం. రాజకీయాలు, సామాజిక అంశాలు, వినోదం ఒకటేమిటి అన్ని జీవనరంగాల పైన తనదైన రీతిలో సమాచార సముద్రాన్ని అనునిత్యం జనం కళ్ళ ముందు కుమ్మరిస్తున్నది టివి. టివి చూడడం కుటుంబాల ప్రధాన వ్యాపకంగా మారిపోయింది. బాలలు,యువత టి.విలకు నెట్‌ తెరలకు అతుక్కుపోయి గంటలు గంటలు గడుపుతున్నారంటే మీడియా పరిష్వంగం ఎంత విడదీయ రానిదో వెల్లడౌతున్నది.

శతాబ్దాలుగా వాడుకలో గల ప్రెస్‌ (press) అన్న పదాన్ని ఇంత తొందరగా పక్కకు తొలగించగలిగిందంటేనే మీడియా సంతరించుకున్న విస్త్రృతి, గాఢత ఎంతటివో అర్థమవుతున్నది. 17వ శతాబ్దంలో వార్తా పత్రికలు, 18వ శతాబ్దంలో మేగజైన్లు, 20వ శతాబ్దంలో రేడియో, టెలివిజన్‌లు ఆవిర్భవించి విస్తృతంగా వ్యాపించినప్పటికీ మీడియా అన్న పదం ఇంతగా వాడుకలోకి రాలేదు. 20వ శతాబ్దం చరమాంకం, 21వ శతాబ్దం ఆరంభంలో డిజిటల్‌ సాంతిేక నైపుణ్యం విలసిల్లడంతో మీడియా రూప, వేగాలు ఊహించని రీతిలో వృద్ధిచెందాయి.
21వ శతాబ్దంలో విశ్వాన్ని వివశురాలిని చేసి విరుచుకుపడిన ఇంటర్‌నెట్‌ -వార్తలు, అభిప్రాయాలు భూమండలం అంతటికీ క్షణాలలో చేరిపోయే మహదవకాశాన్ని కల్పించింది. టెలివిజన్‌ ప్రెస్‌ అన్న పదం ఈ నూతన స్థితిని తనలో ఇముడ్చుకోలేకపోయింది. మాధ్యమం అనే కొత్త పదాన్ని ఆశ్రయించక తప్పలేదు. వాస్తవానికి, పూర్వ కాలం నుంచి పల్లెల్లో వేసే చాటింపు, డప్పు, దండోరాలు, మౌఖికమైన కథా గానాలు, సినిమాలు, నాటకాలు, బాగోతాలు వగైర అన్నీ మాధ్యమం కోవలో వస్తాయి. అయితే వార్తా వ్యాప్తిలో పత్రికలకు ఉన్న శక్తి వీటికి లేకపోవడం వల్ల ఈ సాధనాలను సమాచార వాహికలుగా గుర్తించలేదు. వార్తాపత్రికలు రంగ ప్రవేశం చేయడంతో, వాటి ముద్రణ వ్యవస్థ పేరిట ప్రెస్‌ అనే వర్గీకరణ క్రింద అవి బహుళ ప్రాచుర్యాన్ని పొందాయి. ముఖ్యంగా ప్రజలకు, పాలకులకు మధ్య వారధులుగా, అనుసంధాన కర్తలుగా విశేష ప్రాధాన్యాన్ని గడించుకున్నాయి. రాజు (కింగ్‌), లార్డ్స్‌ (ఎగువ సభ సభ్యులు) కామన్స్‌ (ప్రజా ప్రతినిధులు) –  ఈ మూడింటి తర్వాత నాల్గవ ప్రాధాన్య వ్యవస్థగా ఫోర్త్‌ ఎస్టేట్‌ అని ప్రెస్‌కు 18వ శతాబ్దపు రాజకీయ తత్వవేత్త ఎడ్మండ్‌ బర్కే నామకరణం చేశారు.

ఈ ఫోర్త్‌ ఎస్టేటే ప్రజాస్వామ్య భవనానికి నాల్గవ స్తంభంగా పరిగణన పొందుతున్నది. మీడియా ఎంతటి శక్తివంతమైనదో జర్నలిస్టుల హత్యల వార్తలే చాటుతున్నాయి. ఇరాక్‌ వంటి యుద్ధాలలో ూడా జర్నలిస్ట్‌లను హత్య చేశారంటే వాస్తవ సమాచారం బయటకు పొక్కనీయకుండా చేయడానికి మీడియాను ఎంతగా టార్గెట్‌ చేస్తున్నారో అర్థమవుతున్నది. తాజాగా యుపి లో, మధ్యప్రదేశ్‌లో జర్నలిస్టులను పాలకులు, పాలకవరాలే హత్యచేయించిన దారుణోదంతాలు వార్తలక్కాెయి. గ్రామీణ జర్నలిస్టుల బతుకులు క్షణ క్షణ గండంగా మారాయి. వారికి రక్షణ కరువయింది. వార్తాహరులను, వీవరరవఅస్త్రవతీరను మట్టుపెట్టడంలోని అనౌచిత్యం, సంఘద్రోహం గురించి చెప్పనక్కర్లేదు. ప్రభావవంతమైన సమాచార వ్యాప్తి వ్యవస్థగా మీడియా వర్థిల్లుతున్న క్రమంలో ఇంటర్‌నెట్‌ తెచ్చిన విప్లవాన్ని గురించి ఏమని, ఎంతని చెప్పాలి? నెటిజన్‌ అన్న పదం సిటిజన్‌కు తీసిపోని రీతిలో ప్రాచుర్యాన్ని పొందింది. బ్లాగ్‌, వెబ్‌సైట్‌, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి పలువ్యవస్థల ద్వారా నెట్‌-సమాచార విశ్వవ్యాప్తిని తృటి ప్రాయంకంటె వేగవంతం చేసింది. మనోవేగాన్ని తలపించే అవ్యవధిని సాధించింది. మీట నొక్కగానే లోకదర్శనం – ఎ క్లిక్‌ ఎవే ఇన్ఫర్మేషన్‌ విప్లవాన్ని ఆవిష్కరించింది. దీనితో 21వ శతాబ్దపు మీడియా మరింత శక్తివంతంగా మారింది. అయితే ఇంతటి సమాచార సాంతిేక సమున్నత స్థితి మానవభ్యుదయానికి ఉపయోగపడుతున్నదా లేదా అనే ప్రశ్న సహజంగానే తలఎత్తుతుంది. ఈ ప్రశ్నకు ఎటువంటి నీళ్ళునములుడు లేకుండా, బొత్తిగా లేదనే సమాధానం చెప్పుకోవాలి.

రూపలావణ్యాలు, వన్నెచిన్నెలు ఎంత మహత్తరంగా సంతరించుకున్నా చూపులో మాత్రం మీడియా అత్యంత లోపభూయిష్టంగా, ప్రజావ్యతిరేక ఉన్మాద, దుర్మార్గాలు పూనకం మాదిరిగా ఆవహించిన అవ్యవస్థగా తయారయింది.
అందు మీడియా ఈ రోజున సాంతిేకంగా ఎంత ఉచ్ఛ స్థితిలో ఉన్నదో నైతికంగా అంతటి పతనావస్థకి చేరుకున్నదని అనుకోక తప్పడం లేదు. ఇది కటువుగా అనిపించవచ్చు. కాని కాదనలేని కఠోర వాస్తవం. మెజారిటీ మీడియా విషయంలో ఇది ముమ్మాటికీ నిజం. మీడియా రంగం పెట్టుబడి ప్రధానమైన వ్యవస్థగా మారిన తర్వాత అది ప్రజాస్వామిక విధి బాధ్యతలను పూర్తిగా విస్మరించింది. పాలక వర్గ, వాణిజ్య ప్రభువర్గ ప్రయోజనాలకు పల్లకీ మోయడమే పరమావధిగా, అనుల్లంఘనీయ విధిగా పనిచేస్తున్నది. అయితే ప్రత్యామ్నాయ, విరుద్ధ అభిప్రాయానికి ఎక్కడో ఒక చోట ఎంతోకొంత చోటు లభిస్తూ ఉండడం చీకటిలో చిరు కిరణం వంటి ఊరట.
ప్రఖ్యాత అమెరికన్‌ ప్రజాస్వామిక మీడియా తత్వవేత్త నోవ్‌ుచావ్స్‌ుకీ(NOAM CHOMSKY) WHAT MAKES MAIN STREAM MEDIA MAIN STREAM  అనే వ్యాసంలో ఏమన్నారో చూడండి     IT COMES OUT EVERY DAY. YOU CAN DO A SYSTEMETIC INVESTIGATION. YOU CAN COMPARE YESTERDAYµS VERSION TO TODAYµS VERSION. THERE IS A LOT OF EVIDENCE ABOUT WHAT IS PLAYED UP AND WHAT IS NOT AND THE WAY THINGS ARE STRUCTURED.

కొన్ని విషయాలను బాగా ఎత్తిచూపించడం మరికొన్నింటిని బుద్ధి పూర్వకంగా తొక్కిపెట్టడం జరుగుతున్నదనే విషయం తేటతెల్లం. ఆయన మాటల్లోనే MANUFACTURING CONSENT
(జన సమ్మతిని తయారు చేయడం) అనే దానికి మీడియా ఇప్పుడు ఇస్తున్న ప్రాధాన్యం చెప్పనలవికానిది. ప్రజలలో కలుగుతున్న అభిప్రాయాలను, స్పందనలను, వారి సంతృప్తి, అసంతృప్తులను, సౌకర్య, అసౌకర్యాలను ఉన్నవి ఉన్నట్టుగా చెప్పడానికి బదులు వారి ఆలోచనను, మొగ్గుదలను అదుపు చేసి తాము కోరుకున్న రీతిలో వారిని నడిపించే పాత్రను మీడియా పోషించినపుడు అది ఎవరి స్వామ్యమో విదితమే. దాని వల్ల ప్రజాస్వామ్యానికి కలిగే ముప్పు గురించి వేరే చెప్పనక్కర్లేదు.
ప్రజల ఆలోచనలను అదుపు చేయడం అనేది ఇప్పుడే కాదు ఆది నుంచి మీడియాలో ఉన్నదే. ఆరంభంలో మొదటి ప్రపంచ యుద్ధంలో చేరటానికి విముఖంగా ఉన్న అమెరికాను యుద్ధంలోకి రప్పించడానికి బ్రిటన్‌ సమాచార శాఖ జర్మనీ సైన్యం పై సాగించిన కట్టుకథల దుష్ప్రచార కుట్ర అసాధారణమైనదని, గోబెల్స్‌ ప్రచారం ూడా దానిముందు దిగదుడుపే అనిపించిందనే అభిప్రాయాన్ని నోవ్‌ు చావ్స్‌ుకి వెల్లడించారు. ఈ ధోరణి ఇప్పుడు అంతకు అనేక రెట్లు పెరిగింది. మీడియా పాలక పక్షపాత ప్రచారాస్త్రంగా, ప్రజల దృక్కోణాన్ని మళ్ళించే విష సమాచార సాధనంగా మారిన చోట అది సాంతిేకంగా ఎంత గొప్పతనం సాధించినా నైతికంగా అత్యంత అథోగతి పాలైనట్టే. ఆ విధంగా ప్రధాన వాహిని మీడియాలో ఇది అత్యాధునికత పులుముకున్న అతి క్షీణయుగం అనక తప్పదు. సాక్షాత్కరించిన రంగుల కల అని భ్రమింపచేస్తూ పురివిప్పుకున్న నేటి మీడియా పాలక వర్గాల చేతిలోని రంగులవలగా మారి పోవడం చెప్పనలవి కానంత బాధాకరం. అమెరికన్‌ మీడియా బడ్జెట్‌ లోటు, భారీగా పెరిగిన ద్రవ్యోల్బణం గురించి ప్రచారం చేసినంతగా అక్కడి ప్రజల నిరుద్యోగం, దారిద్య్రం, ఆహార ఆరోగ్య అభద్రత, తెల్లవారికి నల్లవారికి మధ్య అపరిమితంగా పెరిగిన ఆర్థిక వ్యత్యాసాల గురించి చేయదు. ఇండియాలోని జాతీయ, స్థానిక కార్పొరేట్‌, సెమీ కార్పొరేట్‌ మీడియాకు ూడా ఇది వర్తిస్తుంది.
దేశవిదేశీ బ్యాంకులను వేల కోట్ల రుపాయలకు మోసగించి అధికార పదవులు అనుభవిస్తున్న వారి గురించి వ్యాపం, లలిత్‌గేట్‌ వంటి కుంభకోణాల మూలాల గురించి తప్పనిసరి పరిస్థితిలో తప్ప భారత మీడియా అంతగా పట్టించుకోదు. అదే మీడియా దుర్భర సామాజిక నేపథ్యంలో అగ్రవర్ణ, పురుషాహంకార దుష్ట విలువల ప్రభావంలో నేరం చేసే పేదల అకృత్యాలపై విశేషంగా ఫోకస్‌ చేస్తుంది. న్యాయం పొడుగు చేతుల వారి సొంత ముల్లెగా మారి ధనికుల అతి ూర నేరాలకు ూడా ఇసుమంత శిక్ష పడకుండా ఆ సుేలకు ఏళ్ళూ, పూళ్ళూ పట్టిపోతున్నాయి. న్యాయ సహాయంలేక అతి తొందరగా శిక్షలకు, ఉరిశిక్షలకు గురైపోతున్న సామాన్య పేద వర్గాల నేరస్థులు మాత్రమే న్యాయానికి బలైపోతున్నారు. ఈ ఘాెరాన్ని చూస్తూ ూడా అదేమిటని మీడియా అడగదు. సామాజిక నిచ్చనమెట్ల దారుణ వ్యవస్థ ఉన్న చోట శిక్షలు అందరికీ ఒ విధంగా ఉండాలనడంలోని అనౌచిత్యాన్ని ప్రశ్నించదు. న్యాయ వ్యవస్థలోని ఉన్నత స్థానాలలో ఉన్నత వర్గాలే తిష్ఠవేసుకున్న చోట సమన్యాయం, సామాజిక న్యాయం ఎలా లభిస్తాయని నిలదీయదు. మీడియా ఇలా కులాధిపతుల, ధనాధిపతుల దాస్యం చేస్తూ ప్రజాస్వామ్య నీతి క్షతగాత్రయై నెత్తురోడడానికి బలమైన ఊతంగా ఉన్నది.
ఐదు ఎకరాల పొలం ఉన్న ఒక రైతు అప్పు కోసం వెళితే నువ్వు పిల్లలను కనరాదు, ముసలి తల్లిదండ్రుల బాధ్యత వహించరాదు, నీ ఇంటిలో సగం అద్దెకు ఇవ్వాలి వంటి షరతులను వడ్డీ వ్యాపారి విధించడం ఎలా ఉంటుంది? ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐ.ఎవ్‌ు.ఎఫ్‌.) మన విలువలను, జీవన శాంతిని చివరికి మన కాలికింది నేలను ూడా కబళించే షరతులను విధించి మనప్రభుత్వాలకు ఇస్తూ తమ విష రుణ వలయంలోకి మనలను లాగుతూ ఉంటే అందుకు వత్తాసు పలుకుతున్న మీడియా ఎవరిదనాలి?
అమెరికా తన డ్రోన్‌ (మానవరహిత యుద్ధ విమానాలు) విమానాలను తనకు గిట్టని దేశాలలోని టెర్రరిస్టుల’ని తాను ప్రచారం చేసేవారిపై ప్రయోగించినప్పుడు అవి ఆ టెర్రరిస్టుల”తో పాటు చుట్టుపక్కలనున్న అమాయక జనాన్ని హతమారుస్తూ ఉంటాయి. ఆవిధంగా అవి ూడా టెర్రరిజానికి, పాశవిక హత్యకాండకు పాల్పడుతుంటాయి. కాని అమెరికా మీడియా మాత్రం డ్రోన్‌ల అమానుషాన్ని గురించి ఒక్క ముక్క ూడా చెప్పదు. అక్కడ న్యాయమైన సమ్మెచేసి విజయం సాధించిన కార్మికుల గాధలను ఇతివృత్తంగా తీసుకుని నిర్మించే తక్కువ బడ్జెట్‌ చిత్రాలకు ప్రచారం ఉండదు. దానితో వాటికి ఆదరణ ూడా కరువవుతుంది. అదేచోట అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమై విడుదలయ్యే కార్మిక వ్యతిరేక చిత్రాలకు విశేష ప్రచారం లభిస్తుంది. అవి బాక్సాఫీస్‌ హిట్‌ అవుతుంటాయి. పెద్ద నోరున్నవారు చెప్పే అబద్ధాలు ూడా సుబద్ధాలవుతాయి. నోరు లేని వారి సత్యవాక్కు వినిపించకుండా పోతుంది. నేటి మీడియా దుర్మార్గ మాయాజాలానికి ఇంతకంటె నిదర్శనం ఏముంది ?
నిన్నటి సార్వత్రిక ఎన్నికలలో గుజరాత్‌ ఘాతుకాల ఫేవ్‌ు నరేంద్రమోడీకి అండగా మిరుమిట్లు గొలుపుతూ సాగిన కార్పొరేట్‌ ప్రేరిత ప్రచారం ఆయనను ఏవిధంగా దేశ ప్రధానిని చేసిందో కళ్ళముందున్న సత్యమే. అలాగే బాహుబలి సినిమాను, పుష్కరాలు వంటి ఘట్టాలను మీడియా ఎంతగొప్పగా పండించిందో వాటివెంట ప్రజలను వెర్రెత్తించి ఎంతగా పరుగెత్తించిందో తెలిసిందే. ఆ పరుగులో ఎందరు బలయ్యారో కళ్ళ ముందున్న అదే సమయంలో రైతుల ఆత్మహత్యలు, కౌలు రైతుల కన్నీటిగాధలు, బ్రాహ్మణీయ కుల, కుటుంబ సామాజిక వ్యవస్థలు దేశంలో సృష్టిస్తున్న సాంఘిక ఆర్థిక లింగపరమైన కల్లోలాలు- వీటి గురించి ఘనతరమైన మన మెయిన్‌ స్ట్రీవ్‌ు మీడియా బొత్తిగా పట్టించుకోదు.
పి.వి.-మన్మోహన్‌సింగ్‌ జంట దేశాన్ని దివాలా స్థితి నుంచి బయటకుతీసి ఉద్ధరించిందని చేసే కీర్తన, ప్రధానిగా పి.వి. నరసింహారావు జాతికి మోక్ష ప్రదాత అన్నట్టు సాగుతున్న విశేష ప్రచారం ఎంతటి మోసపూరితమైనవో, జనద్రోహకరమైనవో చెప్పనక్కర్లేదు. సంస్కరణల పేరిట ఆయన హయాంలో అంకురించి జడలు విచ్చుకుంటున్న వృద్ధి” ప్రాతిపదిక ఆర్థిక వ్యవస్థ సంక్షేమాన్ని, జనజీవన భద్రతను ఎంతగా బలితీసుకుంటున్నదో తెలిసినదే. అదిగో ఆ మానవ వినాశకర సంస్కరణలను భుజానిత్తుెకొని మోయడంలోనే 21వ శతాబ్దపు మీడియా తరిస్తున్నది. రైతుల ఆత్మహత్యలన్నీ ప్రేమ సూసైడ్‌లేనని వ్యాఖ్యానించగల దుస్సాహసానికి నేడు ఒక ంద్ర మంత్రి ఒడిగట్టగలిగాడంటే అందుకు అటువంటి చెప్పనలవికాని పాలక అమానుషాల పట్ల మీడియా ప్రదర్శిస్తున్న ధోరణే కారణం.
దేశప్రజల ఆలోచన విధానం ఇప్పటికీ మత, కుల వ్యవస్థల చట్రంలోనే కొనసాగుతున్నది. సర్వ మానవ సమానత్వాన్ని, బలహీనులను, మైనారిటీలను లేందించి ముందుకు తీసుకుపోయే సమున్నత సమానవీయ బాధ్యతను నేర్పుతున్న భారత రాజ్యాంగ దృష్టి జనజీవన పరిధిలోకి ఒక్క బొట్టైనా జారకుండా చేస్తున్న 21వ శతాబ్ది ప్రధానవాహిని మీడియా వైద్యుడులా కాకుండా భూతవైద్యుడులా క్షుద్రనాట్యం చేస్తున్నది అంటే తప్పుకాదు. ఉత్తరాది ఖాప్‌ పంచాయితీలు, పరువు హత్యలు సబబైనవే అని చెప్పగల తెగువ హిందుత్వ రాజకీయ నేతలకు కలిగిందంటే కారణం ఈనాటి మీడియా వైఖరే. ప్రజలలో శాస్త్రీయ చైతన్యం రగలడానికి ఆ వెలుగులో సమాజం ముందుకు నడవడానికి దోహదం చేయవలసిన మీడియా అందుకు విరుద్ధంగా ఫ్యూడల్‌, పెట్టుబడిదారీ దొరతనం పాదసేవ చేస్తున్నది. మతపరమైన అగ్రకులపరమైన దురంహంకార ప్రవర్తనను ఆరాధించే వైపు ప్రజలను నడిపిస్తున్నది. పెదరాయుళ్ళ ఫ్యూడల్‌ కోర్టులను మూకోన్మాద సంహారకాండలను ఘనంగా చిత్రిస్తున్నది. వాస్తుకు, జ్యోతిష్యానికి పుష్కరాల వంటి మురికి మూఢ విశ్వాసాలకు ప్రాధాన్యమిచ్చి పిండ ప్రదాన ప్రక్రియలను ూడా భూతద్దంలో రంగుల చిత్రీకరణలలో చూపించి జనాన్ని గొర్రెలను కబేళాలకు తరలించిన చందంగా అటువైపు తరుముతున్నది.
మహబూబ్‌నగర్‌ జిల్లా పెబ్బేరు మండలంలోని ఒక గ్రామంలో తాజాగా ఎస్‌.సిలపై బి.సిలు సాగించిన దౌర్జన్యం మీడియాకు చీమకుట్టినట్టైనా అనిపించలేదు. శ్రీకాకుళం జిల్లా లక్ష్మింపేట దురాగతం మీడియా దృష్టిని తగినంతగా ఆకట్టుకోలేకపోయింది. మానవత్వం ఇలా పదే పదే పరిపరి విధాల మంటగలిసిపోతున్నా ఫర్వాలేదు. యథాపూర్వ, యథాతథ సామాజిక, ఆర్థిక, రాజకీయ, దోపిడీవర్గ నిరంకుశ రాజ్యం ప్రజాస్వామ్య రాజ్యాంగం ముసుగులోనే నిరాటంకంగా కొనసాగేలా చూసే బలమైన కాపలా వ్యవస్థ పనిని 21వ శతాబ్దపు రంగు, హంగుల మీడియా ఎదురులేని రీతిలో నెరవేరుస్తున్నది. అందుచేత రూపుమారినా, చూపుమారని నేటి బడా మీడియా ప్రమాదాన్ని ఇప్పటికైనా గుర్తించాలి.

-G.SreeramaMurthy(call-7036663610)

…………………………………………………………….

Disclaimer: The opinions expressed within this article are the personal opinions of the author. The facts and opinions appearing in the article do not reflect the views of  Ruralmedia and Ruralmedia  does not assume any responsibility or liability for the same.

Share.

Comments are closed.