2020 లో రూరల్ మీడీయా బెస్ట్ వీడియో కథనాలు

Google+ Pinterest LinkedIn Tumblr +

1, కొండంత సంకల్పం!!

కరవు మీద స్టడీకి ఎవరొచ్చినా తీవ్రమైన కరవుకు ప్రతిరూపంగా ఈ కొండను చూపించేవారు. ఈ కొండ పచ్చగా ఉంటేనే ఊరు బాగుంటుందని గుర్తించిన, గురువాజీపేట(ప్రకాశం జిల్లా) ప్రజల్లో కదలిక వచ్చి, కొండ శిఖరం నుండి కింది వరకు 120 ఎకరాల్లో చిన్న జలాశయాల ను తవ్వారు. ఆ ఊరి పరువును భుజాన నాగలిగా ధరించి నడుస్తున్న వాళ్లను పలక రించాం…మీరూ చూస్తారా ? https://youtu.be/gmA3fWqQ3Pw

2 ఇదేమి కోనసీమ కాదు, రాయల సీమ. ఒకప్పుడు కరవుకు మారుపేరు, బతుకు తెరువు కోసం ,లక్షలాది జనం వలసలు వెళ్లే వారు. అదంతా గతం. ఒక పంటకు కూడా దిక్కు లేని చోట, నేడు మూడు పంటలు పండిస్తున్నారు?ఈ గ్రామం పేరు తూపల్లె, అనంతపురం జిల్లా. ఈ కరవు నేలను ఆకుపచ్చగా మార్చిన  రైతుల సాహసం చూస్తారా? ….https://youtu.be/FuP9wgSJ-vk

3 ‘ కడుపుల బిడ్డను మోసినట్లే.. ఈ పంటలను కాపాడాలే అన్నా….’ అని చెబుతూ, తను ఎవుసం చేస్తున్న తీరును కళ్లకు కట్టించింది. భూతల్లికి ఉన్నంత ఓపిక సమ్మవ్వలోనూ కనిపించింది. ఆ రైతమ్మ చెప్పిన కథలో కష్టాలున్నయ్..విజయాలున్నాయ్. కొండంత ఆత్మవిశ్వాసం ఉంది. రండి ఆమె ను పలక రిద్డాము … ….https://youtu.be/–IJ4EQVp5E

4, మెదక్ , గోడ్ గార్ పల్లి జొన్న పొలంలో కనిపించాడు ఈ బక్కజీవి. ఈ దేశపు సగటు రైతు రూపం ఇలాగే ఉంటుంది కానీ, లాక్ డౌన్లో సకల వృత్తులు మూలన పడినపుడు ఈ రైతు మనకు అన్నం సృష్టించడం చూసి, కంకులు వంగి అతడి పాదాల ను తాకుతున్న అరుదైన దృశ్యాలను మా టీం క్యాప్చర్ చేసింది!! https://youtu.be/o0t2Sc699HI

5, ‘‘ మీ బిడ్డలకు రక్త హీనత ఉంది… బలమైన ఆహారం పెట్టండి. పాలు ,బూస్ట్,హార్లిక్స్ తాగి పించండి..’’ అన్నారు వైద్యులు. నిత్యం బువ్వ కోసం వెతుక్కునే ఆ మహిళలకు బూస్ట్ లు కొనే స్తోమతు లేదు. అలాగని ఊరుకోలేదు. ఒక అరుదైన సహజమైన ఆహారం కనిపెట్టారు.  ఆ ‘శబరి బూస్ట్ ’ ని మీరూ రుచి చూస్తారా ? https://youtu.be/A9V0Vei7bD8

6, జల వనరుల నిపుణులు , సర్కారీ ఇంజనీర్లు వీటిని చెక్ డ్యామ్ అంటారు. దైవాల రావూరు (prakasam dist) గ్రామస్తులు ‘వానకట్టలు ’ అని మాకు కొత్తపదాన్ని పరిచయం చేశారు. ఈసారి వీరి టైం బాగుండి గత పదేళ్ల తరువాత ఈ కరువు ప్రాంతంలో విస్తారంగా వానలు పడ్డాయి.  ఎనభై ఎకరాల్లో పుష్కలంగా పంటలు పండిస్తున్నారు.  మీకు సమయం ఉంటే ఒక లుక్ వేయండి…https://youtu.be/TWMDjXeLHII

7, అదిగో మళ్లీ కొమ్ముబూర, డప్పు శబ్దం వినిపిస్తోంది… కరోనాకు చెమటలు పడుతున్నాయి… ఆ పల్లె జీవితం కొత్త చిగుర్లు తొడుగు తోంది. రండి చూసి వద్దాం … https://youtu.be/0W57P-Uf78o

8, చుట్టూ అందరూ పత్తి,జొన్న పండిస్తుంటే , వాటికి భిన్నమైన పంటలు తన భూమికి అలవాటు చేయాలని అరటి తోటలు వేశాడు. అంతర పంటగా పసుపు నాటాడు. నీటి వసతి లేక పోయినా డ్రిప్ ఇరిగేషన్ చేసి, చెరువు మట్టి చల్లి, చక్కని దిగుబడి సాధిస్తున్నాడు. ఎకరాకు ఎవరు ఊహించనంత ఆదాయం ఆర్జిస్తున్నాడు..పరోక్షం గా 30 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. కెమెరా ను జూమ్ చేయగా, అతడు సింగల్ టేక్ లో సక్సెస్ ని వివరించాడు…https://youtu.be/7weG5gxkyTc

9, ‘‘ ఒక అయిదు వేలు లోన్ కోసం వచ్చినం సారు.. ఇవ్వం పొమ్మంటున్నారు..’’ అన్నారు. వారు గొర్రెలు కాసుకొని బతుతున్నారట, స్వార్ధంతో పరుగులు తీసే, ఆర్ధిక సంస్ధలు వారి పట్టుదలను పెట్టుబడిగా గుర్తిస్తాయా..? ఇదంతా రెండేళ్ల నాటి సంగతి..ఇపుడు ఆ పేద స్త్రీలకూ సమయం వచ్చింది, బ్యాంకు వారి వెంట పడి లోన్లు ఇస్తున్నాయి…? MGNCRE కోసం తీసిన ఒక జీవన చిత్రం… https://youtu.be/LAu0dC-th5w

10, ‘‘ ఇప్పుడంటే మీలాంటి వారు ఈ పొలం లోకి వస్తున్నారు కానీ, అరేళ్లు వెనక్కి పోతే ఇక్కడ గడ్డి పరక కూడా మొలకెత్తేది కాదు. చుట్టుపక్కల రైతులంతా కాడి వదిలి, వలసలు పోయారు.. ఒక్కడినే ఈ భూమిని మచ్చిక చేసుకున్నాను. మట్టి మొత్తం మార్చి చెరువు మట్టిని నింపాం. రసాయన ఎరువు వాసన కూడా మా భూమికి తాకకుండా, వర్మీ కంపోస్ట్ తో పంటలు పండిస్తున్నా…’’ అని కరెంట్ రావడంతో మోటార్ ఆన్ చేశాడు ఆంజనేయులు… హనుమంతుడికి తన బలం తనకు తెలీదంటారు, కానీ ఈ ఆంజనేయుడికి తన శక్తి మీద పక్కా క్లారిటీ ఉంది… మీరే చూడండి…… https://youtu.be/YLg7ntq4RgA

11, జిల్లా… అనంతపురం, ఊరు… చెర్లోపల్లి, చెరువుపక్కనే ఉండటంతో ఆ పేరు వచ్చింది. కాల క్రమంలో చెరువు చచ్చి పోయింది, పల్లె మాత్రమే మిగిలింది. అలాంటి చోట నీటి చుక్కను నిలుపు కోవడానికి ఒక ఉద్యమం మొదలైంది.. ఆ పోరాటానికి నాయకురాలు సహరాబీ. ఆ తల్లిని దర్శించుకునే ముందు వారు సాధించిన జలాశయంలో మునకలు వేసి….కెమారా స్టార్ట్ చేశాం. ఆ దృశ్యం మీ కోసం…

12 ‘‘ ఇదంతా ఒకపుడు అడవి … నేల కింద నీటి చుక్క లేదు… నాలు గేళ్లుగా ఈ మట్టితో సావాసం చేసి , ఇలా మార్చాను…’’ అంటూ, ఎండిన బొప్పాయి ఆకులను తెంచి చెట్టు మొదళ్లలో వేశాడు…ఇంతలో మా డిజిటిల్ కెమేరా స్టార్ట్ అయింది… అతడి సక్సెస్‌ని చూడాలనుకుంటే,మీరు అంత దూరం వెల్లక్కర లేదు… ఈ వీడియో క్లిక్ చేయండి!! https://youtu.be/-0HOm-b_4p4

Share.

Leave A Reply