ఐ-ఫోన్‌ గిఫ్ట్‌ వచ్చిందా..? ఐతే చదవండి!!

Google+ Pinterest LinkedIn Tumblr +

వికారాబాద్‌కి చెందిన వెంకట్‌కి ఒక అపరిచిత వ్యక్తి కాల్‌ చేసి, ‘పేటీఎం సేల్స్‌, ప్రమోషన్‌ విభాగం నుండి మాట్లాడుతున్నాం. మీకో గుడ్‌ న్యూస్‌. మీరు ఐ-ఫోన్‌7 గిఫ్ట్‌ గెలుచుకున్నారు…” అని చెప్పాడు.
ఈ గిఫ్ట్‌ కావాలంటే రూ.5000 వారి పేటీఎం ఖాతాలో జమ చేయమని చెప్పాడు.
ఐ-ఫోన్‌ మీద మోజుగా ఉన్న వెంకట్‌ అలానే డిపాజిట్‌ చేసాడు.
తరువాత జిఎస్‌టీ కోసం మరో రూ.9772/- పేటీఎం ఖాతాలో డిపాజిట్‌ చేయమంటే వెంకట్‌ అలాగే చేసాడు.
ఆ తరువాత , వెంకట్‌ ఐ-ఫోన్‌ కోసం ఎదురు చూస్తే, రాలేదు. కానీ, అదే అపరిచిత వ్యక్తి, మీ డబ్బులు మాకు రాలేదు మళ్ళీ డిపాజిట్‌ చేయమంటే ,వెంకట్‌ అలా 5 సార్లు చేసి రూ.65000/- పోగొట్టుకున్నాడు.
స్మార్ట్‌ ఫోన్‌ వాడుతున్న పౌరులకు విజ్ఞప్తి. మీరు పేటీఎం వాడుతున్నారా? ఇక నుండి మీరు జాగ్రత్తగా ఉండాలి. పేటీఎం పేరుతో సైబర్‌ నేరగాళ్లు చేసే మోసపూరిత కాల్స్‌ నమ్మకండి. అని, తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ శాఖ హెచ్చరిస్తోంది.

ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్
Visit www.digitalpolice.gov.in  to report crime, for helpline call 155260 between 9am to 6pm

Share.

Leave A Reply