అరకు ఎప్పుడు వెళ్లాలి?

Google+ Pinterest LinkedIn Tumblr +

అరకు ఎప్పుడు వెళ్లాలి?
నా పోస్టులు చూసిన చాలామంది మిత్రులు అడుగుతుంటారు?
అరకులోయకు ఏ సమయంలో వెళ్లాలి? అక్కడ చూడాల్సినవి ఏమిటి?
ఆ కొండల మధ్య ఇల్లు కట్టుకొని ఉండిపోవచ్చా? అని…
నిజానికి ఎపుడు చూసినా అరకు అద్భుతంగానే ఉంటుంది.
ఆగస్టు నుండి డిసెంబర్‌ నెలల్లో వెళితే చిక్కగా, పచ్చగా ఉంటుంది.
1, అనంతగిరి దాటి అరకులోకి అడుగు పెడుతుంటే రోడ్‌ పక్కనే ఆర్గానిక్‌ కాఫీగింజలతో పాటు మిరియాలు,యాలకులు,లవంగాలు అమ్ముతున్న ఆదివాసీ అమ్మాయిలు నవ్వుతూ పలకరిస్తారు. అక్కడ కాఫీని ఆస్వాదించి తీరాలి. నచ్చితే నాలుగు ప్యాకెట్లు కొనండి.
2, అరకు పక్కనే అంత్రిగుడలో కిల్లోడుంబు అనే రైతు సేంద్రియ ఎరువుతో సపోటా పండ్లతోటలో క్యారెట్‌,క్యాబేజీ పండిస్తున్నాడు. అతడ్ని కలిస్తే మీకో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు.
3, అడవుల్లో కాయలు, కలప కోసం తిరుగుతున్న పిల్లలందరికీ ఓ నీడను ఇచ్చి ఆడుతూ పాడుతూ అక్షరాలు నేర్పుతున్న ‘థింక్‌పీస్‌’ సంస్దను తప్పకుండా చూడాలి.ఇక్కడే మీరు రీచ్చార్జ్‌ అయి బతుకు పట్ల అవగాహన పెంచు కుంటారు.
4, పోర్ట్‌ట్రస్టు గెస్ట్‌ హౌస్‌ ఎదురుగా ఉన్న మెస్‌లో లంచ్‌ చేయండి. హోమ్లీగా ఉంటుంది.
5, సాయం సమయంలో చినుకులు పడుతున్న వేళ రహదారి పక్కనే ‘బొంగులో చికెన్‌ ‘ కనిపిస్తుంది. ఆకుపచ్చని వెదురు బొంగుల్లో నాటుకోడి ముక్కలు ఉంచి నిప్పుల మీద ఫ్రై చేసి అమ్ముతారు. రుచి చూడాల్సిందే.
అరకు అందాలు చూశాక అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. కానీ కష్టం. గిరిజన చట్టాలు అందుకు ఒప్పుకోవు. కానీ ఏడాదికోసారి ఇక్కడి గాలిని పీలిస్తే ఆయుష్సు
మరింత పెరుగుతుంది.

Share.

Leave A Reply