ఏపీలో జర్నలిస్టులకు ఇక పండుగే!!

Google+ Pinterest LinkedIn Tumblr +

దశాబ్దాలుగా సమస్యల వలయంలో విల విల లాడుతున్న జర్నలిస్టులకు, జగనన్న వరాలు 
ప్రకటించ బోతున్నారు. ఇటీవల ఐ అండ్‌ పిఆర్‌ మంత్రి తో ప్రత్యేక భేటీ లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది . త్వరలోనే హామీల అమలుకు కార్యాచరణ కూడా సిద్ధం అయింది. దేశంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టుల కుటుంబాలకు మేలు చేయాలని జగన్‌ డిసైడ్‌ అయ్యారు. ఆయన తీసుకోబోయే నిర్ణయాలు అమలు అవుతే , అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుందని పాత్రికేయ లు
అంటున్నారు. అనధికార వర్గాల నుండి వచ్చిన ఈ సమాచారం సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతోంది. ప్రభుత్వం జర్నలిస్టులకు అమలు చేయాలనుకుంటున్న పథకాలు ఇలా ఉండవచ్చు అంటున్నారు.   
1, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు 
2, తెలంగాణ తరహాలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లని నిర్మించి ఇవ్వాలని నిర్ణయం ..?
3, ఏ పాఠశాలలో చదివించినా జర్నలిస్టుల పిల్లలకు ఫీజు ప్రభుత్వమే చెల్లించాలి అని నిర్ణయం..? 
4, స్కూల్‌ ఫీజు సంవత్సరానికి గరిష్ట పరిమితి 50 వేలు … కాలేజ్‌ ఫీజు సంవత్సరానికి గరిష్ట పరిమితి 70 వేలు 
5, రాష్ట్రంలో జర్నలిస్టు కుటుంబాలకు బస్సు ప్రయాణం పూర్తిగా ఉచితం…? 
6, పదవీ విరమణ చేసిన జర్నలిస్టులకు 15 వేల పెన్షన్‌ 
7, రాజన్న జర్నలిస్ట్‌ హెల్త్‌ స్కీం ద్వారా, 20 లక్షల వరకూ వైద్య సహాయం ఉచితంగా అందించ బోతున్నారు. 
8, అక్రిడేషన్ల జారీ ప్రక్రియ సులభతరం చెయ్యాలి అని నిర్ణయం ?
9, ఏపీ సచివాలయం లో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా క్యాంటిన్‌ ఏర్పాటు ఉచిత భోజన సదుపాయం..?

ఇళ్ల స్థలాలకు సీఎం సానుకూలం!! 
సీఎం జగన్‌ను ఐజేయూ అధ్యక్షుడు దేవులపల్లి అమర్‌, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు గురువారం కలిసి, జర్నలిస్టుల సమస్యలపై జగన్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం దేవులపల్లి అమర్‌, మీడియాతో మాట్లాడుతూ వర్కింగ్‌ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, హెల్త్‌స్కీమ్‌లో వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని జగన్‌ హామీ ఇచ్చారని తెలిపారు. జర్నలిస్టులకు అక్రిడేషన్‌, పెన్షన్‌, పిల్లలకు ఉచిత విద్య అందించాలని సీఎంను కోరామని, సీఎం సానుకూలంగా స్పందించారని ఐవీ సుబ్బారావు అన్నారు.

” సోషల్‌మీడియా కథనాలు వాస్తవం కాదు” 
జర్నలిస్టులకు ప్రోత్సహాకాలు ప్రకటిస్తున్నట్టు, సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వార్తా కథనం వాస్తవం కాదని,ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. శాసన సభా సమావేశాల సందర్భంగా ,మీడియా పాయింట్‌ దగ్గర మంత్రి క్యూలైన్‌లో నిలబడి భోజనం చేశారు. ఆ సమయంలో కొందరు జర్నలిస్టులు వాట్సాప్‌ లో వచ్చిన కధనం గురించి చెప్పగా స్పందించిన మంత్రి జర్నలిస్టుల న్యాయమైన సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు.

Share.

Leave A Reply