తుల్జారామ్‌… గ్రీన్‌ సలాం

Google+ Pinterest LinkedIn Tumblr +

తుల్జారామ్‌… గ్రీన్‌ సలాం
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్‌ మండలం, ఖాసింపూర్‌ గ్రామంలో రైతులు ఇప్పుడిప్పుడే
ప్రకతి వ్యవసాయం వైపు మళ్ళుతున్నారు. రసాయనిక వ్యవసాయంతో నష్టాలు, వ్యాధులే తప్ప మరో ప్రయోజనం లేదని గ్రహించిన తుల్జారామ్‌ ప్రకతి వ్యవసాయం వైపు అడుగులు వేశారు. అలా అడుగులు వేసేలా నాబార్డ్‌ ప్రోత్సహించింది. తన ఇంటి ఎదురుగానే వున్న అరెకరం భూమిని కౌలుకు తీసుకుని కూరగాయలు పండిస్తున్న తుల్జారామ్‌ గౌడ్‌ నాబార్డ్‌ సాయంతో, జీవామతం కలిపే డ్రమ్‌, జీవామతం తయారు చేయడానికి అవసరమైన బెల్లం, వేప పిండిని సమకూర్చుకొని, దేశవాళీ టొమేటోను పండిస్తున్నాడు. మొక్కల చీడపీడల నివారణకు గోమూత్రం, గోమయంతో చేసిన మిశ్రమాన్ని చల్లుతూ మంచి ఫలితాలను పొందుతున్నాడు.

green salam to telangana farmer

green salam to telangana farmerఒక రైతుగా గర్విస్తున్నా: తుల్జారామ్‌ గౌడ్‌

” గతంలో నేను రసాయనిక వ్యవసాయం చేసేవాడిని. దాని ద్వారా నేల పాడయ్యేది. ఎరువులు చల్లేటపుడు రసాయనాల వల్ల నా ఆరోగ్యమూ దెబ్బతినేది. ఇక ఆ పంటను తినడం వల్ల వినియోగదారులకూ నష్టం జరిగేది.. ఈ ప్రమాదాల నివారణకు ఇప్పుడు నేను ప్రక తి వ్యవసాయం వైపు మళ్ళాను. ఇప్పుడు నా భూమి బాగుంది.. నేను బాగున్నాను.. నా కూరగాయలు తినే వారు బాగున్నారు.” అంటాడు ఆనందంగా.

Share.

Leave A Reply