శ్రీసిటీ… స్త్రీ శక్తి

Women power in Sri City

శ్రమలో నువ్వే, పరిశ్రమలో నువ్వే…
స్వేదంలో నువ్వే, సేద్యంలో నువ్వే
ప్రతీ మెతుకులో నువ్వే…
మా బతుకులో నువ్వే
నీ నవ్వే … మాకు దివ్వె … 

ఉపాధి కల్పనలో ఇదొక అపూర్వం, ఎలాంటి నైపుణ్యం, ఉన్నత విద్యార్హతలు లేనప్పటికీ పదో తరగతి వరకు చదివిన అమ్మాయిలకు ఇక్కడ ఉద్యోగాలు దొరికాయి.

Women power in Sri City

Women power in Sri City

శ్రీసిటీ(chittore district,satyavedu)లో ఏర్పాటైన తైవాన్‌ బహుళజాతి సెల్‌ఫోన్‌ తయారీ సంస్థ రైజింగ్‌స్టార్‌ మొబైల్‌ ఇండియా లి. (ఫ్యాక్స్‌కాన్‌) ప్లాంట్‌లో మూడు షిఫ్ట్‌ల్లో సుమారు 9000 మంది మహిళలు పనిచేస్తున్నారు. సెల్‌ఫోన్‌ విడిభాగాలు తీసుకువచ్చి ఫోన్లు అసెంబుల్‌ చేయడం ఇక్కడి పని. నెలకు దాదాపు 10 లక్షల ఫోన్లు అసెంబుల్‌ చేస్తున్నారు. ప్రపంచమంతా పాపులర్‌ అయిన షియోమి, జియోని, ఆసూస్‌ బ్రాండ్ల్‌ ఫోన్లు శ్రీసిటీ గ్రామాల మహిళల చేతుల్లో తయారవుతున్నాయి.
18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల వయస్సున్న మహిళలను ఎంపిక చేసి, శిక్షణ ఇచ్చి సెల్‌ఫోన్స్‌ అసెంబుల్‌ చేయగలిగేలా తీర్చిదిద్దారు. ఇక్కడపని చేస్తున్నవారిలో 90 శాతం శ్రీసిటీ చుట్టు ప్రక్కల స్థానికులే! నెలకు సుమారు రూ . 12 వేలు జీతం వస్తున్నట్లు ఇక్కడ పనిచేస్తున్న మహిళలు చెప్పారు. వీరిని ప్లాంట్‌కు తీసుకొచ్చి, తీసుకెళ్లడానికి దాదాపు 50కి పైగా బస్సులు ఉన్నాయి. పరోక్షంగా బస్సులు సిబ్బందికి కూడా ఉపాధి కలిగింది.

Women power in Sri City

Women power in Sri City

ఒకప్పుడు బతుకు తెరువులేక, కూలిపని దొరక్క సెల్‌ఫోన్లో పాటలు వింటూ కాలక్షేపం చేసిన గ్రామీణ మహిళలు నేడు సెల్‌ఫోన్లనే తయారుచేసే స్థాయికి ఎదగడం పారిశ్రామిక ప్రగతిలో ఒక సంచలనం. ఇప్పుడు వారు సెల్‌ఫోన్లు మాట్లాడే తీరిక కూడా లేకుండా ఉద్యోగాల్లో మమేకం అయ్యారు. ఊరి పక్కనే ఉపాధి, స్థిరమైన వేతనాలు, భవిష్యత్‌కి భరోసా దొరకడంతో ఆత్మవిశ్వాసంతో బతుకుతున్నారీ మహిళలు !
శ్రీ సిటీలో మొబైల్స్‌ తయారు చేసే రైజింగ్‌ స్టార్‌ మొబైల్స్‌ పరిశ్రమలో శ్రీసిటీకి భూములను ఇచ్చిన పద్నాలుగు గ్రామాలకు చెందిన వేలాదిమంది యువతులు ఉద్యోగాలు చేస్తున్నారు. చాలామంది యువతులు పెద్దగా చదువుకోకపోయినా వారికి మొబైల్స్‌ అసెంబ్లింగ్‌లో శిక్షణ ఇచ్చారు. నెలకు ఆరువేల జీతంతో ఉద్యోగాన్ని ఇచ్చి క్రమంగా జీతాలు పెంచుకుంటూ వెళ్తోంది. రైజింగ్‌ స్టార్‌ మొబైల్‌ కంపెనీ నుంచి పది అడుగులు నడిస్తే వచ్చే సిద్ధమ్మ అగ్రహారం గ్రామానికి చెందిన కల్పన, కవిత, దీప ఇలా ఉద్యోగాన్ని పొందినవారే. ఒకటిన్నర సంవత్సరం నుంచి ఇక్కడ ఉద్యోగం చేస్తున్న వీళ్ళు ప్రస్తుతం నెలకు ఏడు వేలు సంపాదిస్తూ సంతోషంగా వున్నారు.
ఊరి పక్కనే ఉద్యోగం…
”మాది చిలమత్తూరు. మా పేరెంట్స్‌ ఫార్మర్స్‌. నేను డిగ్రీ చదివా. అలా చదువు పూర్తయిందో లేదో ఇలా శ్రీసిటీలో వున్న రైజింగ్‌ స్టార్‌ మొబైల్స్‌ కంపెనీలో జాబ్‌ వచ్చేసింది. ఐదు నెలల నుంచి జాబ్‌ చేస్తున్నా. మా ఊరు పక్కనే కంపెనీ. ఎలాంటి ఒత్తిడి లేని ఉద్యోగం. అంతా హ్యాపీ. ఎనిమిది వేల జీతం. ఇంటి నుంచి నడిచేంత దూరంలో ఉద్యోగం వుండటం బోలెడంత సౌకర్యం. థాంక్స్‌ టు శ్రీ సిటీ. పది అడుగులు వేస్తే చాలు పరిశ్రమలోకి చేరుకుంటాం”.
– కల్పన, కవిత, దీప

………………………………..

-Team,RuralMedia

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *