కొండ ప్రజలు గుండె చప్పుడు వింటారా?

Google+ Pinterest LinkedIn Tumblr +

కొండ ప్రజలు గుండె చప్పుడు వింటారా? 
……………………………………………….. 
విశాఖ ఏజన్సీలో విసిరేసినట్టున్న గ్రామం జంగంపుట్టు, 
కొండవాలులోని ఊటనీటి కుంటలే వీరికి జీవజలం. అవీ లేని వారు బావుల్లో అడుగంటిన మురికి నీళ్లతో గొంతు తడుపుకుంటున్నారు. ఇక్కడి భూములన్నీ వాలుగా ఉంటాయి. అక్కడే ‘మెట్ల సాగు’ చేస్తూ వరి, వేరు శనగ, క్యాబేజీ పండిస్తున్నారు. 
ప్రభుత్వం అమలు చేస్తున్న అనేకనేక సంక్షేమ పథకాలు ఈ గిరిజన పల్లెలకు ఇంకా చేరలేదు. కిరోసిన్‌ గుడ్డి దీపాల్లో బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. ఒకటీ ఆరా కరెంట్‌ పోల్స్‌ వేసినా వారానికో సారి విద్యుత్‌ వస్తుంది. సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్న ఈ కొండ ప్రాంతంలో గాలులు విపరీతంగా వీయడం వల్ల కరెంట్‌ తీగెలు తెగి పడుతుంటాయి. వీటిని సరిచేసే లైన్‌ మేన్‌ లు కోసం కబురు చేయాలన్నా సెల్‌ఫోన్‌లు పలకవు. కారణం వాటికి ఛార్జింగ్‌ పెట్టుకోవడానికి పవర్‌ లేదుగా… అసలు లైన్‌మేన్‌ రావాలన్నా ఈ గ్రామానికి దారి లేదు. ఇక్కడే మొదలైంది అసలు సమస్య అంటారీ గ్రామస్తులు… 
మాకు దారి చూపండి 
” జంగంపుట్టు నుండి గత్తుం రోడ్‌లోకి రావాలంటే అడవిలో ముళ్లపొదల మధ్య 3కిలో మీటర్లు దూరం కాలి బాటలో నడిచి పొవాలి. మధ్యలో చిన్న ఏరు కూడా ఉంది . వానా కాలంలో దీని వల్ల ఈ దారి కూడా కట్‌ అయి పోతుంది. రోగాలు వచ్చినా ,గర్భినీ స్త్రీలకు నొప్పులు వచ్చినా ఆసుపత్రికి వెళ్లడానికి ఛాన్సేలేదు. మా సమస్యలను ప్రజా ప్రతినిధుల దగ్గర ఎన్ని మార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదు. 
జంగంపుట్టు నుండి గత్తుం వరకు రహదారి వేస్తే మాకు బయట ప్రపంచంతో లింక్‌ ఏర్పడుతుంది. ఈ దారిలొ పదికి పైగా పెద్ద బండరాళ్లు ఉన్నాయి వాటిని తొలగించి రహదారి నిర్మించాలి.ఈ రోడ్డు వల్ల గాలిపాడు,వెలగపాడు,దుర్గం గ్రామస్తులకు కూడా మేలు కలుగుతుంది. 
 
పాడేరు ఐటీడిఏ అధికారులు హుకుం పేట మండలంలోని ఈ మారు మూల గిరిజన పల్లె సమస్యను పరిష్కరించి వారికి జనజీవన ప్రవంతికి దారి వేయాలని రూరల్‌ మీడియా విజ్ఞప్తి చేస్తోంది. 

………………

The Jangamputtu(Hukumpet mandal,Visakha disrtrict, AP) locals said that they have been demanding three kilometre-long connecting road to their village for several years now but the administration has not taken any step

Share.

3 Comments

Leave A Reply