ఇక్కడ ప్రతి ఇంటికి..ఉద్యోగం

With A Lady Sarpanch & all Employment

ఇదొక శ్రమ సమాజం !
చిత్తూరు జిల్లా సత్యవేడు మండలంలోని, ముత్తేరుమిట్ట మేజర్‌ పంచాయితీలో వున్న ఏడు గ్రామాల్లో తొండూరు గ్రామం ఒకటి. మొత్తం 130 కుటుంబాలున్నాయి. దశాబ్దం క్రితం బతుకు తెరువు కోసం వలసబాట పట్టిన ఈ గ్రామస్తులు నేడు సుస్ధిర జీవనం గడుపుతున్నారు.దీనికి కారణం పారిశ్రామీకీకరణ. వీరికి సమీపంలో శ్రీసిటీ పారిశ్రామిక పార్కు రావడంతో ఈ గ్రామంలో ఇంటికొకరు శ్రీసిటీ లో ఉద్యోగం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ముత్తేరుమిట్ట సర్పంచ్‌ కవిత ‘రూరల్‌ మీడియాతో’ మాట్లాడుతూ
” నేను 2013 నుంచి సర్పంచ్‌గా వున్నాను. 2006లో శ్రీసిటీ ప్రారంభానికి ముందు, ఇప్పటికీ మా ఊరిలో చాలా అభివద్ధి జరిగింది. అప్పుడప్పుడు ఈ ఊరు ఆ ఊరేనా అనిపిస్తూ వుంటుంది. ఒకప్పుడు మా తొండూరు గ్రామం గొడవలకి కేరాఫ్‌ అడ్రస్‌గా వుండేది. ఇప్పుడు అందరిలో పెద్దరికం వచ్చింది. కల్చరల్‌గా అభివద్ధి జరిగింది. శ్రీసిటీ కారణంగా మా ఊరందరికీ ఉపాధి దొరకడమే కాదు.. మాలో నాగరికత కూడా పెరిగింది. ఒకపుడు కురిసీ కురవని వానలతో పండీ పండని భూములతో ఇబ్బందులు పడే వాళ్ళం. ఇప్పుడు అలాంటి ఇబ్బందులేవీ లేవు. మా ఊళ్ళో వున్న 90 శాతం యువత శ్రీసిటీ రాగానే ఐటీఐల్లో చేరిపోయి నైపుణ్యం పెంచుకున్నారు. అదే అందరికీ ఉద్యోగాలు రావడానికి దోహదం చేసింది. ఇటీవలి కాలంలో శ్రీసిటీలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదంటూ కొంతమంది ఉద్యమం చేస్తున్నారు. ఇది బయటినుంచి వచ్చిన వారు చేస్తున్న  కృత్రిమ ఉద్యమం మాత్రమే…”.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *