Smiles of success!

white (milk) revolution' in Telangana

ప్రతీ ఉదయం హైదరాబాద్‌లో లక్షలాది పిల్లలు తాగుతున్న ‘విజయ’ పాలు వెనుక ఉన్న శ్రమ జీవులు వీరే.
రాజమణి,లావణ్య,మణమ్మ, అజీజా, మంజుల ఒకపుడు ఎవరికి వారే రోజూ కూలీ పనులు చేసుకునే అతి సామాన్య మహిళలు. బల్వంతా పూర్‌ (మెదక్‌జిల్లా) గ్రామానికి చెందిన వీరి బతుకు ఏడాది క్రితం చిన్న మలుపు తిరిగింది.
వ్యవసాయ పనులు లేక పోవడంతో బ్యాంకు రుణంతో బర్రెలు కొని పాలు అమ్మకం మొదలు పెట్టి, నెలకు రూ.16 వేల వరకు సంపాదిస్తున్నారు. వీరిని చూసి మరో 140 మంది పశుపోషణకు ముందుకొచ్చారు.
దృశ్యం ఇక్కడ కట్‌ చేస్తే…
ఈ గ్రామంలో రోజుకు 15వేల లీటర్ల పాలు సేకరిస్తున్నారు. అవే విజయా బ్రాండెడ్‌ పాల ప్యాకెట్‌లుగా మారి ప్రతీ ఉదయం హైదరాబాద్‌ ఇళ్ల ముందుకు చేరుతున్నాయి. ఈ పల్లె మహిళలు కృషిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ముందుకువచ్చి పాలశీతలీకరణ కేంద్రం ఏర్పాటు చేసింది. వీరి విజయ ధరహాసం చూడడానికి దేశం నలుమూలలను నుండి డెయిరీ డెవలప్‌ మెంట్‌ అధికారులు క్యూ కడుతున్నారు. సిద్ధి పేట నుండి 25కిలో మీటర్ల దూరంలో బల్వంతా పూర్‌ ఉంది.
– ఫోటోలు-కె.రమేష్‌ బాబు,రూరల్‌మీడియా

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *