
చేతులు కలిసే, చెరువు నిండే…
…………………………..
ఆధునిక మానవుడు తాను ప్రకృతిలో భాగమని అనుకోకుండా ప్రకృతి పై పెత్తనాన్ని చెలాయించి ,జయించాలని ప్రకృతిపై యుద్దం చేస్తున్నాడు.
కానీ ఆ పోరాటంలో తాను గెలిచినా ఓటమి పాలయ్యేది తన భవిష్యత్ తరాలే నన్న సంగతి మరిచి పోతున్నాడు. చెరువులు,కుంటలు,పచ్చని పొలాలను ఎడాపెడా దోపిడి చేసి పర్యావరణానికి హానికలిగిస్తున్న బ్యాడ్ టైమ్లో .. ప్రకృతిని గుండెల్లో దాచుకుంటున్న ఒక మారు మూల పల్లె ప్రజల మధ్య కొన్ని గంటలు గడిపే అవకాశం కలిగింది.
కరీంనగర్ నుండి ఛత్తీస్గడ్ సరిహద్దుల వైపు ఎనభై కిలోమీటర్లు వెళ్తే మలహర్ మండలంలో, కొయ్యూరు అనే కుగ్రామం ఉంది. అక్కడంతా వ్యవసాయం మీద ఆధారపడి బతికేవారే. వీరు పండించే వరి,మొక్కజొన్నకు సాగునీటికి ఆధారం కొయ్యూరు ఊట కుంట. దీని విస్తీర్ణం 30 ఎకరాలు. దీనిని కబ్జా చేయాలని చాలామంది ప్రయత్నించారు కానీ ఊరంతా ఏకమై కాపాడుకున్నారు.ఏడు నెలల క్రితం గ్రామస్తులంతా కలిసి మెలసి చెరువు లోని పూడిక తీసి ఆ మట్టితో చెరువు గట్లు పటిష్టం చేసుకున్నారు. ఆరవై మంది రైతులు తమ పొలాల్లో పూడిక మట్టిని చల్లకొని నేలను సారవంతం చేసుకున్నారు. ఈ ప్రకృతి రక్షకులు చేసిన పని వల్ల చెరువు లోతు పెరిగింది.దీని కింద 96ఎకరాలు సాగు చేస్తున్నారు. మానేరు నది ఎండి పోయినప్పటికీ ఏడాదంతా ఈ చెరువు నిండుగా ఉంటోంది. పక్క రాష్ట్రాల నుండి పక్షులు ఇక్కడికి వలస వస్తున్నాయి. ఇక ఈ గ్రామంలో బోర్లు,బావుల జలమట్టం చేతికి తగులుతోంది.
చెరువును కాపాడుకోవాలనుకునే ఈ ప్రజల ఆకాంక్షను చూసిన ఉపాధిహామీ పథకం క్షేత్ర సహాయకుడు బుర్రి లక్ష్మినారాయణ చెరువు పూడిక తవ్వడంలో పనిచేసిన వారికి ఉపాధి నిధులు అందేలా చేశారు.
ఇది ప్రజల భాగస్వామ్యంతో సాధించిన హరిత విప్లవం. కాదంటారా?
(Shyammohan/MGNREGA/ Ruralmedia)
excellent story, congrats to ruralmedia
thank u
I3kBfZ qofehvybfveb, [url=http://sqmvyyazbhlm.com/]sqmvyyazbhlm[/url], [link=http://hngresymapzz.com/]hngresymapzz[/link], http://usvnxtsrsxod.com/