సమష్టి కృషితో …

Village Women Dairy Development in telangana

సమష్టి కృషితో …
చేయ చేయి కలిపితే ఏదైనా సాధించవచ్చని నిరూపించారీ అనంతారం మహిళలు. పాడిపంటలు బాగుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. వ్యవసాయానికి పశు సంపద తోడైతే రైతుల జీవనోపాధుల మరింత మెరుగవుతాయి. ఈ నేపథ్యంలో జనగాం జిల్లా,గుండాల మండలం, అనంతారంలో స్వయం సహాయక గ్రూపులకు చెందిన 60మంది మహిళలకు షార్ప్‌ స్వచ్ఛంద గ్రామీణమహిళలకు జీవనోపాధి కల్పన, శిక్షణ పథకాల్లో భాగంగా, పాడి పశువుల పెంపకం పై నాబార్డు ఆర్ధిక సహకారంతో శిక్షణ ఇచ్చారు.
మహిళలకు పశుపోషణపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఆదాయం పెంచడం, పాలు అమ్మకాల పై సుస్థిర ఆదాయం వచ్చేలా చేయడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.
గతం….

అనంతారం గ్రామజనాభా 2,850. అందరూ వ్యవసాయం పై ఆధారపడిన వారే. పశు పోషణ ఉన్నప్పటికీ రైతులకు సరైన దిశా నిర్దేశం లేక పశువుల పెంపకం పై అవగాహన లేక పాల దిగుబడి తక్కువగా ఉండేది. వ్యాధుల పై అవగాహన లేక పశు నష్టం జరిగేది.
నేడు…
ఇటీవల మహిళలకు పాడి పశువుల పెంపకం పై శిక్షణ ఇచ్చారు. ఒక్కొ గ్రూప్‌లో 30మంది సభ్యులుంటారు. ప్రసిద్ది చెందిన పశుజాతులు నుండి,
పాడికి అనువైన గేదెజాతి పశు జాతులు, విదేశీ గోజాతి గురించి అవగాహన కల్గించారు. పశుగ్రాసం, పశువులకు వచ్చే వ్యాదులు వాటి నివారణ పై అవగాహన కల్గించారు.
మార్పు…
గతంలో అనంతారంలో 350 లీటర్లు మాత్రమే పాల సేకరణ జరిగేది. నేడు మహిళలకు షార్ప్‌ సంస్ధ నుండి శిక్షణ పొందాక 540 లీటర్ల వరకు పాల ఉత్పత్తి పెరిగింది. వీరి ప్రగతిని గమనించిన బ్యాంకులు కూడా రుణాలివ్వడానికి ముందుకు వస్తున్నాయి. జీవనోపాధుల మెరుగుదలకు నాబార్డు రుణాలు ఇవ్వడంతో కొందరు పాడిపశువులను కొని సుస్ధిర జీవితం గడుపుతున్నారు.
అందరిలో ఆత్మవిశ్వాసం …
” మేం ఎప్పటి నుండో పశువులను పెంచుతున్నాం కానీ వాటి గురించి సరైన అవగాహన లేదు. నాబార్డు, మాకు ట్రైనింగ్‌ ఇవ్వడం పశుపోషణ గురించి అనేక విషయాలు తెలుసుకున్నాం. మా పొదుపు సంఘం మహిళలందరం కలుసుకున్నపుడు పశువుల పెంపకం పై ఏ సమస్యలున్నా, చెప్పుకొని పరిష్కారం పొందుతున్నాం.” అంటారు కమ్యునిటీ రీసోర్స్‌ పర్సన్స్‌ నూనె ముంతల పద్మ,నెల్లుట్ల ఉమ,రూరల్‌మీడియాతో…

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *