కరువు నేలలో కల్పవృక్షం

Under rain-fed condition, Malabar neem cultivation is a safe bet for farmers.

కరువు నేలలో కల్పవృక్షం
తక్కువ నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో త్వరగా పెరిగే, అరుదైన చెట్టు మలబారు వేప. నాటిన నాలుగేళ్ల నుంచి నలభై ఏళ్ల వరకు ఆదాయాన్నిచ్చే ఈ అడవి జాతి చెట్లు కరవును తట్టుకుంటాయి. ఎరువులు, పురుగు మందులు ఖర్చులేకుండా వీటిని సాగుచేయవచ్చు. ప్రకాశం జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మద్దిపాడు మండలం(ప్రకాశంజిల్లా) సీతారామపురంలో కందిమళ్ళ శ్రీదేవి, రామంజనేయులు మలబారు వేపను పెంచుతున్నారు. 2015మార్చి నెలలో వీరిద్దరికీ 1,110 మొక్కలు చొప్పున ప్రభుత్వం ఇవ్వగా వాటినిలా తోటగా మార్చారు. ఒక సాయంత్రం వీరిని రూరల్‌మీడియా పలకరించగా ” మలబార్‌ వేప నాటిన రెండేళ్లలో 40అడుగులు పెరుగుతుంది. అయిదవ ఏట నుండి ఆదాయం వస్తుంది.టన్నుకు రూ.8వేలు రేటు ఉన్నది. మరో నాలుగేళ్లలో ఈ కలప మీద వచ్చే ఆదాయం మాకు సుస్ధిర జీవనోపాధి కల్పిస్తుంది.” అని సంతోషంగా అన్నారు.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *