ఉసిరి చూసి మురిసి పోతున్నారా?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఉసిరి చూసి మురిసి పోతున్నారా?
………………………………….
ఈ దేశంలో ప్రతీ మనిషికి నీడ కల్పించడం సర్కారు కనీస బాధ్యత.బ్యాడ్‌లక్‌ ఏమంటే గూడునివ్వకుండా ఆధార్‌ కార్డులు,బ్యాంక్‌ ఎకౌంట్లు ఇస్తామంటున్నారు. ఉసిరి చెట్లకింద సేద తీరుతున్న ఈ జంట ఒకపుడు సంచార జీవులు.అడవుల్లో పసలపోలుగడ్డలు,పుల్లింజి పండ్లు, తేనె ఏరుకొని,అడివిపిట్టలను వేటాడి బతికే వారు. వీరికి సర్కారు భూమి ఇచ్చింది కానీ అది కొండల మధ్య వాన చుక్క ఇంకని,దారితెన్నూ లేని చోట ఉంది.
వారికెలాగైనా సుస్ధిర జీవితం ఇవ్వాలని సునంద(మాస్‌) గారు వారి భూమిని అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చారు..ఆమె నిజాయితీని గుర్తించిన నాబార్డు మోహనయ్యగారు ఆ బంజరు నేలను సస్యశ్యామలం చేయడాని టీడీఎఫ్‌ నిధులు మంజూరు చేశారు.

planted-by-mohanaiah-cgm-nabard

planted-by-mohanaiah-cgm-nabard

సీన్‌ కట్‌ చేస్తే…
యానాదులంతా పండ్లతోటలకు యజమానులయ్యారు. మామిడి,సపోటా,ఉసిరి పండిస్తూ ఆత్మవిశ్వాసంతో బతుకుతున్నారు.పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు.
అభివృద్ధి అంటే మెరుగైన జీవితం
(చిత్తూరు జిల్లా,బంగారు పాళ్యం మండలం,జయంతి గ్రామం నుండి శ్యాంమోహన్‌)

Share.

Leave A Reply