
భద్రాద్రి గోదారి దాటి 40కిలో మీటర్లు అటవీ మార్గంలో వెళ్తుంటే, ఎగువ ప్రాంతంలో దారి పొడవునా తాడిచెట్లతో కనిపించే గ్రామం చిన ఆర్లగూడెం.అందరూ వ్యవసాయం మీదే అధార పడినప్పటికీ సాగునీరు లేక పంటలు పండక కొందరు వలస పోయే వారు.
ఎవరో వచ్చి ఏదో చేస్తారని కల్లు తాగుతూ కాలక్షేపం చేయకుండా నాబార్డు ఇచ్చిన ఆసరాతో ఆరేళ్ల క్రితం ఇక్కడ నీటి కుంటలు తవ్వి ఎగువ నుండి వచ్చే వాన నీటిని ఇంకించారు.వారి కష్టం వృధా పోలేదు. గుండి రమా దేవి లాంటి పేద మహిళల భూమిలో మామిడి తోటలు చిగురించాయి. ఆకు కూరలు, మిర్చి పంటలకు పుష్కలంగా నీరు అందుతోంది. ఇదంతా వాటర్ షెడ్ మహత్యం అని ‘రూరల్మీడియా’ తో సంబరంగా చెప్పారు గిరిజన మహిళలు.-pic/k.rameshbabu/ruralmedia