Header ad
Header ad
Header ad

Toilet: Ek Adivasi Tanda Katha

No Swachh Bharat for Telangana village

ఇది టాయిలెట్‌ సినిమా కాదు, జీవితం
మన దేశాన్ని మదర్‌ ఇండియా అని పిలుచుకుంటాం కానీ,ఈ దేశంలో ఎందరో అమ్మలు,అక్కలు,చెల్లెళ్లు,కూతుళ్లు,భార్యలు కాలకృత్యాల కోసం బయటకు వస్తూ సిగ్గుతో ప్రతీ రోజూ బతక లేక చస్తున్నారు.అత్యాచారాలకు గురవుతున్నారు.ఇది ఆత్మగౌరవ సమస్య మాత్రమే కాదు.స్త్రీల ఆరోగ్య భద్రత,జీవన ప్రమాణాల సమస్య కూడా. 95కుటుంబాలున్న గట్టేపల్లి తండా(అదిలాబాద్‌జిల్లా)లో ఒక్క పాయాఖానా కూడా లేక పోవడం సర్కారీ నిర్లక్ష్యానికి నిదర్శనం.

Toilet: Ek Adivasi Tanda Katha

Toilet: Ek Adivasi Tanda Katha

ఆడబిడ్డలు కాలకృత్యాల కోసం అడవుల్లోకి పోవాలి.పాముల,అడవి జంతువుల నుండి కాపాడుకోవడానికి ఈ గిరిజనులు పడని కష్టాలు లేవు.తెలంగాణా గ్రామాల్లో 53 శాతం మందికి మాత్రమే మరుగుదొడ్ల సదుపాయం ఉంది.మిగతా వారిలో ఈ తండా వాసులున్నారు..ఉపాధి హామీ పథకం,స్వచ్ఛభారత్‌మిషన్‌ గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణం
చేస్తున్నట్టు పత్రికల్లో చూస్తాం కానీ, వారెందుకో ఈ మారు మూల తండాల వైపు ఇంకా చూడలేదు. ఏడు దశాబ్దాల స్వాతంత్య్రం, అడవిబిడ్డలకు ఆత్మగౌరవం ఇదీ.

  • pics/k.rameshbabu/Adilabad/ruralmedia

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *