పాలనకే వన్నెతెచ్చిన ఇద్దరు ఐఎఎస్‌లు

Google+ Pinterest LinkedIn Tumblr +

గ్రామీణాభివృది ్ధలో నిబద్ధత-దీక్ష-దక్షతకు మారు పేరుగా నిలిచారు ఇద్దరు ఐఎఎస్‌ అధికారులు. నిబంధనలూ, తంతులూ , అడ్డంకులూ వారిని నిరుత్సాహ పర్చలేకపోయాయి. వారు దీక్షా కంకణ బద్ధులు. అంకిత భావంతో పనిచేసిన ఇద్దరు ఐఎఎస్‌ అధికారులు 2017లో తమ కొత్త ఆలోచనలు రంగం మీదకి తెచ్చారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో అనేక పల్లెలకు మేలు చేశారు. వెరసి పాలనను ప్రజలకు మరింత చేరువ చేశారు. వీరి ప్రతిభా పాటవాలూ, దక్షతా కలసి పాలనలో సానుకూల మార్పు తెచ్చాయి. వీరి కృషి జాతీయ స్థాయిలో వార్తలకెక్కి స్ఫూర్తిగా నిలిచింది. ఆంధ్రా, తెలంగాణలోని ఇద్దరు పాలనాధికారుల గురించి తెలుసుకుని తీరాల్సిందే.
”ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ ఉక్కు చట్రం లాంటిది. దీనిమీదే మిగతా పాలనా యంత్రాంగం అంతా ఆధారపడి ఉంటుంది. పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా సుపరిపాలన కొసాగించే కంచుకోట ఐఎఎస్‌” అని ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభాయి పటేల్‌ అభివర్ణిచారు.
అయితే భారత స్వాతంత్య్రానంతరం అనేక దశాబ్దాలు గడిచేకొద్దీ వల్లభాయి పటేల్‌ పేర్కొన్న ఉక్కుచట్రానికి తుప్పుపడుతోందా? బలహీనమవుతోందా? అనే సందేహాలు వ్యక్తమవుతూ వచ్చాయి. అనేక వర్గాల నుండి ఇటువంటి సంశయాలు తలెత్తుతున్న నేపథ్యంలో క్రమంగానూ, స్థిరంగానూ మార్పు వచ్చింది. సరికొత్త ఆలోచనలూ , వాటిని అమలు చేసేదీక్షా గల ఐఎఎస్‌ అధికారులు దీనికి కారణం. తెలుగు వారైన ఇద్దరు ఐఎఎస్‌ అధికారులు ఇటువంటి మార్పునకు కారకులు. వారే చిత్తూరు జిల్లా కలెక్టర్‌ పి.ఎస్‌ ప్రద్యుమ్న, మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌. గ్రామీణాభివృద్దిలో వినూత్న సేవలకు The Better India సంస్థ జాతీయ స్థాయిలో వీరిని టాప్‌టెన్‌ ఐఎఎస్‌ల్లో ఇద్దరిగా గుర్తించి గౌరవించింది.
పల్లెసీమలకు ప్రగతి బాటలు వేస్తున్న పి.ఎస్‌.ప్రద్యుమ్న
చిత్తూరు జిల్లా పాలనాధికారిగా పల్లె నిద్ర కార్యక్రమం లో పిఎస్‌ ప్రద్యుమ్న లక్షవరకూ టాయిలెట్లు నిర్మించి స్వచ్ఛ గ్రామీణం దిశగా అడుగులు వేశారు. అలాగే హంద్రీ నీవా ప్రాజెక్టు కింద కరువు ప్రాంతాల్లో జల సంరక్షణ చర్యలు చేపట్టారు. పక్కా ప్లాన్‌ ప్రకారం ఆయన ఎంతో చొరవ చేసి తీసుకున్న చర్యలు అభివృద్ధికి ఊపిరి పోశాయి. ప్రజలకి కొత్త జీవితాన్నిచ్చాయి.

Desilting pond-pillarikona-rcpurammandal

Desilting pond-pillarikona-rcpurammandal

ప్రద్యుమ్న పల్లెవనం అనే మరో కార్యక్రమం చేపట్టారు. దీని వల్ల గ్రామాల్లోకి పార్కులు వచ్చాయి. గ్రామాల్లో చెట్లపెంపంకం విస్తారంగా అమలు చేశారు. రహదారులకు ఇరుపక్కలా చెట్లను పెంచడమే కాకుండా ఈ పల్లె వనాల్లో బెంచీలు ఏర్పాటు చేశారు. వాకింగ్‌ ట్రాక్స్‌ ఏర్పాటు చేశారు. పల్లెవనం కార్యక్రమం విశేషంగా ప్రజాదరణ పొందింది. అలాగే వినూత్నమైన తరహాలో నిర్భయ నిఘా కార్యక్రమం అమలు చేశారు. ఇది కూడా ప్రజాదరణ పొందింది. విద్యాసంస్థలు, బస్టాపులు, తదితర ప్రాంతాల్లో మహిళా కానిస్టేబుళ్లతో నిఘా ఏర్పాటు చేశారు. మహిళలపై లైంగిక వేధింపులు జరగడానికి అవకాశం ఉన్న చోట్ల మహిళా కానిస్టేబుళ్లు ఎలక్ట్రిక్‌ మోటారు బైకుల మీద గస్తీ తిరుగుతూ ఉంటారు. రైతులకు
వ్యవసాయ యంత్రాలు సరసమైన ధరలకు అద్దెకు దొరికే విధంగా హైరింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. దీనివల్ల చిన్న కారు రైతులకు మేలు జరిగింది. అలాగే జాతీయగ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఫారంపాండ్స్‌,చెక్‌డ్యామ్స్‌లో పూడిక తీసి,భూగర్భ జలవనరులను పెంచారు. పల్లెల్లో సీసీ రోడ్లు నిర్మించారు. పేదలకు పనిహక్కుని కల్పించారు. రైతులకు మైక్రోక్రెడిట్‌ అందుబాటులో ఉండేలా చూశారు.

avenue plantation-in chintagunta(yarravaripalem mandal)

avenue plantation-in chintagunta(yarravaripalem mandal)

అంగన్‌ వాడీ కేంద్రాల్లో చిన్నారులకు,బాలింతలకు సమర్థంగా సేవలు అందించేలా చూశారు. బంగారుపాళ్యంమండలం, మహాసముద్రం గ్రామంలోని శిధిలావస్ధలో ఉన్న అంగన్‌ వాడీ కేంద్రాన్ని పునర్మించి మౌలిక వసతులు కల్పించి అద్బుతమైన ప్లేస్కూల్‌గా తీర్చిదిద్దారు. జిల్లా యంత్రాంగం అంగన్‌ వాడీ కార్యకర్తలకు ”యశోద డిప్లోమా” సర్టిఫికెట్‌ కార్యక్రమంలో ఆరోగ్యం, పోషకాహారం,విద్య వంటి అంశాలతో పాటు ఇంగ్లీషు భాషలో కమ్యూనికేషన్‌, కంప్యూటర్‌ పరిజ్ఞానంలో కూడా శిక్షణ ఇచ్చింది. ప్రద్యుమ్న రూపొందించిన ఈ పథకాల వల్ల పాలనలో పల్లెప్రజల భాగస్వామ్యం కూడా పెరిగింది.
దివ్యాంగుల్లో వెలుగు నింపిన… రోనాల్డ్‌ రోస్‌
తెలంగాణలోని మహబూబ్‌ నగర్‌ జిల్లా లో బహిరంగ మల మూత్ర విసర్జన రహితమైన గ్రామాల సంఖ్య అనతి కాలంలోనే గణనీయంగా పెరిగి, అభివృద్దిలో కొత్త రికార్డులు సాధించింది. రైతుల్లో కూడా సేంద్రియ, పర్యావరణహితమైన పద్ధతుల్లో వ్యవసాయం చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. హరితహారం సాధించడంలోనూ, ఇంటింటా ఇంకుడు గుంతల నిర్మాణంలోనూ ముందు వరసలో ఉంది.

District Collector,Mahabubnagar1

Collector,Mahabubnagar1

అద్భుతమైన ఈ మార్పు వెనుక ఉన్న వ్యక్తి రోనాల్డ్‌ రోస్‌. 2016 బ్యాచ్‌, తెలంగాణ క్యాడర్‌ కు చెందిన ఐఎఎస్‌ అధికారి రోనాల్డ్‌ రోస్‌ ప్రభుత్వయంత్రాంగానికి దిశా,నిర్దేశం చేస్తూ, జిల్లాను అభివృద్ది పథం వైపు తీసుకెళ్లారు. ముఖ్యంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసి, గ్రామీణ వికాసంలో జిల్లాను రాష్ట్రంలోనే ముందువరసలో నిలబెట్టారు.

District Collector,Mahabubnagar

DistrictCollector,Mahabubnagar

దివ్యాంగ సౌర సంఘం రోనాల్డ్‌ రాస్‌ వినూత్న ఆలోచన. వికలాంగులకు ఉపాధి కల్పించి వారిని అభివృద్ధిలో భాగస్వాములు చెయ్యడానికి కొత్త తరహాలో చేసిన ఆలోచన ఇది. ”దివ్యాంగ్‌ సోలార్‌ సొసైటీ” సంస్థ వికలాంగులకు శిక్షణ ఇచ్చి, సోలార్‌ ల్యాంప్‌లను తయారు చేస్తూ, ఆత్మవిశ్వాసంతో జీవించేలా చేశారు. దీని వల్ల వందలాది దివ్యాంగులు ఎవరి మీదా ఆధార పడకుండా స్వయం సమృద్ధి సాధిస్తున్నారు.

ఇలా ఈ ఇద్దరు ఐఎఎస్‌ అధికారులు తమ దీక్షా దక్షతలతో ప్రజలకు సేవ చేశారు, పాలనా వ్యవస్థకు సైతం వన్నె తెచ్చారు.

Pics/Ruralmedia Team

Share.

Leave A Reply