కలం కార్మికులకు కేసీఆర్‌ కాన్క

chief minister KCR on Friday revealed that houses for journalists would be constructed and the government would bear the entire cost for it.

కలం కార్మికులకు కేసీఆర్‌ కాన్క
……………………………………………………
 హైదరాబాద్‌లో దశాబ్దాల తరబడి మీడియాలో పనిచేస్తూ సొంత ఇళ్లను సమకూర్చుకోలేని పాత్రికేయులెందరో. ఎట్టకేలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ జర్నలిస్టులకు నీడ కల్సిస్తున్నారు. నిన్న క్యాంపు ఆఫీసులో తనను కలిసిన జర్నలిస్టు నాయకుల కి హైదరాబాద్‌లోని జర్నలిస్టులందరికీ ఇళ్లు కట్టించి ఇస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు.  ప్రభుత్వ ఖర్చుతో ప్రతి జర్నలిస్టుకు సొంత ఇల్లు ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.

chief minister KCR on Friday revealed that houses for journalists would be constructed and the government would bear the entire cost for it.

chief minister KCR on Friday revealed that houses for journalists would be constructed and the government would bear the entire cost for it.

సమాజహితం కోసం పనిచేసే ప్రతి జర్నలిస్టు కుటుంబానికి, పిల్లలకు ఇల్లు రూపంలో ఒక ఆస్తి మిగలాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని సీఎం పేర్కొన్నారు.

గేటెడ్ కమ్యూనిటీలో రెసిడెన్షియల్ టవర్లు, క్లబ్‌హౌజ్, మార్కెట్, స్కూల్,  పార్కు, మల్టీప్లెక్స్ ఉండేలా అద్భుతమైన టౌన్‌షిప్ నిర్మిస్తామని వెల్లడించారు.

ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సీనియర్ జర్నలిస్టులు శ్రీనివాస్‌రెడ్డి, దేవులపల్లి అమ ర్, క్రాంతికిరణ్  తదితరులు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. జర్నలిస్టు టౌన్‌షిప్ కోసం అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని రంగారెడ్డి, మెదక్ కలెక్టర్లు రఘునందన్, రోనాల్డ్ రాస్, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డిని సీఎం ఆదేశించారు.

 ఇక ప్రభుత్వమే పాత్రికేయుల గృహనిర్మాణానికి ముందుకు రావడంతో జర్నలిస్టులు గతంలో ఏర్పాటు చేసుకున్న హౌసింగ్‌ సోసైటీలను రద్దు చేసుకోవడానికి అంగీకరించారు. 

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *