సినబ్బ సేద్యం

Google+ Pinterest LinkedIn Tumblr +

‘నీకో రెండెకరాలిస్తున్నాం,పండగ చేసుకో ‘ అని పట్టా చేతిలో పెట్టింది సర్కారు. వెతికి చూస్తే… అన్నీ గుట్టలు,రాళ్లు…ముళ్లపొదల మధ్య నిలబడి చూస్తే, ఎదురుగా పులిగుండు కొండమీద శివుడు కన్పించాడు. ఒక దణ్ణం పెట్టి పలుగు,పార పట్టాడు చిన్నబ్బ. అలా ఏడాదంతా కష్టపడి నేలను మచ్చిక చేసుకున్నాడు ఏటవాలుగా ఉన్న ప్రాంతంలో పంటకుంట తవ్వి వాననీరంతా దానిలోకి మళ్లించాడు. పైన కొండరాయి మీద నీటినిలువ కుంటను ఏర్పాటు చేసి దానిలోకి కింది నీటిని పంపింగ్‌ చేసి, గ్రావిటీ ద్వారా మామడి తోటకు,కూరగాయలకు డ్రిప్‌తో అందిస్తున్నాడు. ఈ సీన్‌కి బ్రేక్‌ ఇస్తే… ఇపుడు సిన్నబ్బ పండించిన మామిడి పండ్లు కోసం బెంగళూరు మార్కెట్‌ వాళ్లు క్యూ కడుతున్నారు.
ఒకపుడు ఉపాధి హామీ కూలీగా బతికిన ఇతడు రైతుగా మారి మరి కొందరికి బతుకు తెరువు చూపించాడు. చిత్తూరుకి అరవై కిలోమీటర్ల దూరంలో నిలువుగా ఉండే పులిగుండు కొండ పక్కనే ఉన్న చేరవగాని పల్లెలో సిరులు పండించిన సినబ్బను చూడొచ్చు.

Share.

Leave A Reply