ఇచ్చుటలో ఉన్న హాయి…

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇచ్చుటలో ఉన్న హాయి…
వంద ఇళ్ళు దాటని తండాల్లో జీవిస్తున్న గిరిజనానికి వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. ఈ శ్రమజీవులకు సాగు నీరు అందుబాటులో వుంటే అద్బుతాలు సష్టించగలరు. గుట్టల మీద పడిన వాన నీరు పల్లంలోకి జారిపోకుండా ఒడిసి పట్టుకునే వాటర్‌ షెడ్‌ పథకాలకు ఇంద్రవెల్లి, మండలంలొ ఏకలవ్య ఫౌండేషన్‌ అమలు చేస్తోంది. అలా భూగర్భ జలాలు పెరిగాయి. అలాంటి నీరు వృధా కాకుండా రైతులందరూ సమష్టిగా వినియోగించుకుని సాగు చేసుకునే మరో వినూత్న పథకానికి ఏకలవ్య ఫౌండేషన్‌ శ్రీకారం చుట్టింది. అదే ‘వాటర్‌ షేరింగ్‌’.
మన పొరుగు వారు మనతో సమానంగా ఎదగడానికి అవకాశం ఇవ్వడం అసలైన సంఘ జీవనానికి తార్కాణం. ఈ సూత్రాన్నే దష్టిలో పెట్టుకుని ఏకలవ్య ఫౌండేషన్‌ రూపకల్పన చేసిన వాటర్‌ షేరింగ్‌ ఇంద్రవెల్లి గిరిజన గ్రామాల్లో మంచి ఫలితాలను సాధిస్తోంది. వాటర్‌షెడ్‌ అమలులో వున్న ప్రతి గ్రామంలో వాటర్‌ షేరింగ్‌ అమలు అవుతోంది.
కొంతమంది రైతులను ఒక జట్టుగా చేస్తారు. నీటి లభ్యత వున్న ప్రాంతంలో బోరు వేస్తారు. ఆ బోరు ద్వారా వచ్చిన నీటిని బోరు వేసిన భూమికి చెందిన రైతు మాత్రమే కాకుండా చుట్టుపక్కల వున్న రైతులు కూడా ఉపయోగించుకుంటూ వుంటారు. ఏ రైతుకు ఎప్పుడు నీరు అవసరమవుతుందో ముందుగానే నిర్ణయించుకోవడం వల్ల రైతులందరికీ సక్రమంగా నీరు అందుతోంది. నీటి పంపిణీకి అవసరమైన పైపులు, స్ప్రింక్లర్‌లను ఏకలవ్య ఫౌండేషన్‌ అందిస్తోంది. వాటర్‌ షేరింగ్‌ పథకం సక్రమంగా అమలు కావడానికి రూపొందించిన నిబంధనలను గిరిజన రైతులు తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. దీని వల్ల రైతులు నీటి ఇబ్బందులు లేకుండా పంటలు పండిస్తూ చక్కని దిగుబడులు సాధిస్తూ, ప్రగతి పథంలో పయనిస్తున్నారు.
వాటర్‌ షేరింగ్‌ వల్ల దిగుబడులు పెరిగాయి
”గతంలో నేను, మా చుట్టూ వున్న రైతులు వ్యవసాయం కోసం నీళ్ళు సరిపోక ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం. ఏకలవ్య ఫౌండేషన్‌ మా గ్రామంలో అమలు చేసిన వాటర్‌ షేరింగ్‌ వల్ల మా పరిస్థితి మారింది. మేమంతా ఒక క్రమ పద్దతిలో ఎప్పుడు ఎవరికి నీరు అవసరం అయితే వాళ్ళు వాడుకుంటున్నాం. అందరి చేలూ పచ్చగా
ఉంచుకోగలుగుతున్నాం. వాటర్‌ షేరింగ్‌ ఒప్పందంలో భాగంగా ఒక బోరు చుట్టు పక్కల ప్రాంతాల్లో మరో బోరు వేయకుండా జాగ్రత్త తీసుకుంటున్నాం. వాటర్‌ షేరింగ్‌ వల్ల మా చుట్టుపక్కల రైతుల మధ్య స్నేహం కూడా పెరిగింది.” అంటున్నారు… మోతుగూడకు చెందిన రైతు కిషన్‌.

Pic/k.rameshbabu/ruralmedia/wsd

Share.

Leave A Reply