చిట్టి తల్లికి చేయూత

The Kasturba Gandhi Balika Vidyalaya scheme was introduced by the Government of India in August 2004

చిట్టి తల్లికి చేయూత
పేద అమ్మాయిల చదువుకోసం జరుగుతున్న కృషి ఇది
తెలంగాణలో ప్రాథమిక విద్య స్థాయిలో బాలురతో పోలిస్తే బాలికల శాతం తక్కువగా ఉన్నది. ఈ నేపథ్యంలో విద్యలో జెండర్‌ వ్యత్యాస సమస్యను పరిష్కరించేందుకుగాను కస్తూర్బా విద్యాలయాల పథకాన్ని2004లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సమాజంలోని వెనుకబడిన వర్గాలలోని బాలికలకు ప్రాథమిక విద్య స్థాయిలో రెసిడెన్షియల్‌ స్కూళ్లు, వసతి పాఠశాలల ఏర్పాటు చేయడం ద్వారా వారికి మెరుగైన విద్య అందించడం కేజీబీవీ సంస్థ లక్ష్యం.

విద్యలో వెనుకబడిన ప్రాంతాలలోని షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, మైనారిటీ కమ్యూనిటీలు, దారిద్య్రరేఖకు దిగువున ఉన్న కుటుంబాలకు చెందిన బాలికలకు కేజీబీవీ విద్యాసౌకర్యాలు కల్పిస్తుంది. రాష్ట్రంలోని జిల్లాల వ్యాప్తంగా 398 కేజీబీవీలు ఉన్నాయి. 2016-17 విద్యా సంవత్సరంలో 72,583 బాలికలు కేజీబీవీలలో చేరి చదువుకుంటున్నారు.

ఈ చిన్నారులు చదువుకోవడానికి వీలుగా 30 డెస్క్‌లను సామాజిక బాధ్యతగా అరబిందో ఫార్మా కంపెనీ ఉచితంగా అందించింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా, గూడూరు గ్రామంలోని కేజీబీవీ విద్యార్ధినులు అంకుష్‌,ప్రసన్న లను రూరల్‌మీడియా పలకరించినపుడు” ఈ స్కూల్‌లో మాకు చక్కని వసతి సౌకర్యం కల్పించారు. బెంచీలు లేక నేల మీదనే చదువుకుంటున్న మాకు అరబిందో ఫార్మ కంపెనీ చక్కని డెస్కులను సమకూర్చి ప్రశాంతంగా చదువుకునే పరిస్ధితి కల్పించారు. పరిశుభ్రమైన ఆహారం అందిస్తున్నారు. చదువుతో పాటు కల్చరల్‌ యాక్టివిటీస్‌లో కూడా మాకు శిక్షణ ఇస్తున్నారు.” అని సంతోషంగా చెప్పారు.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *