మహిళా సాధికారతకు కొత్త నిర్వచనం

Google+ Pinterest LinkedIn Tumblr +

మహిళా సాధికారతకు కొత్త నిర్వచనం

(Ruralmedia-Feature Desk)

ఆరు గంటలకు ఆలారం పెట్టుకొని లేవడం, ఆదరాబాదరా తయారవడం, ఉడికీ ఉడకని ఒక ముద్ద బాక్స్‌లో సర్దుకొని బస్‌స్టాప్‌ కి పరుగులు పెట్టడం,ఎపుడొస్తుందో తెలీని సిటీ బస్‌కోసం ఎదురు చూసి,కిక్కిరిసిన బస్సులో వేలాడుతూ కంపెనీకి పోవడం…కాస్త లేట్‌ అయినా బాస్‌తో తిట్లు తినడం, ఇదీ సగటు వర్కింగ్‌ వుమెన్‌ జీవన శైలి.
ఇలాంటి దిక్కుమాలిన బతుకును బ్రేక్‌ చేసిన అపూర్వ దృశ్యం చూడాలనుకుంటే తూరుపు కోస్తా తీరం వైపు ఒక లుక్‌ వేయండి. అచ్యుతాపురం గ్రామాల్లో ఇళ్లముందు వందలాది మినీ బస్సులు ఆగుతాయి. ఆమ్మాయిలంతా ఆహ్లాదంగా బస్సుల్లోకి ఎక్కి తమ సీట్లలో కూర్చుని కష్టసుఖాలు ముచ్చటించుకుంటూ ఆఫీసులకు చేరుకుంటారు.ఆకు పచ్చని ల్యాన్‌లో దిగి, ఏసీ హాల్‌కి చేరుకొని కూల్‌గా పనిచేసుకుంటారు. క్యాంటీన్లో పదిరూపాయలకే సబ్సిడీ లంచ్‌ చేస్తారు.

The inspiring stories of women empowerment in Rural Andhra

The inspiring stories of women empowerment in Rural
Andhra

సాయంత్రం సురక్షితంగా అవే బస్సుల్లో ఇళ్లకు చేరుకుంటారు.
ఇలా 18వేల పేద అమ్మాయిలకు సగౌరవంగా పని కల్పించి, women’s empowerment కు కొత్త నిర్వచనం చెప్పిన అరుదైన అభివృద్ది వెనుక ఒక మానవీయ సీనియర్‌ ఐఎఎస్‌ ఆఫీసర్‌ కృషి ఉంది. ఉద్యోగుల జీవితాలని మరింత మెరుగ్గా తీర్చిదిద్ది కంపెనీని ఆదర్శవంతంగా ముందుకు నడిపించడంలో ఒక యువ పారిశ్రామిక వేత్త పట్టుదల ఉంది. గ్రామీణ జీవితాలను సమూలంగా మార్చేసి 50వేల మందికి బతుకు తెరువు చూపిన ఒక వెలుగు బాటను త్వరలో ‘రూరల్‌మీడియా టీం’ మీకందించ బోతుంది.

Share.

Leave A Reply