అల్లుకుంటున్న ఆకుపచ్చని అభివృద్ధి

The Impact of NREGA on Agriculture

అల్లుకుంటున్న ఆకుపచ్చని అభివృద్ధి
…………………………………..
” వరి,చెరకు పంటలు వేసి,భూగర్భ జలాలు వృధా చేయకుండా తక్కువ నీటితో కూరగాయల సాగు చేద్దామనుకుంటున్నాం కాస్త చేయూత నివ్వండి ” అని డ్వామా అధికారులను కర్లాం గ్రామం (విజయనగరం జిల్లా) లోని బాణాల ఆదిలక్ష్మీ, ఆశపు గౌరమ్మ, కెల్ల ఈశ్వరమ్మ, రెడ్డి శివమ్మ, పొదిలాపు లక్ష్మిలు అడిగారు. జలసంరక్షణ పై వారి అవగాహనకు ముచ్చట పడి, పందిర్లపై కూరగాయలు సాగుకు ఉపాధి హామీ పథకంలో పండాల్స్‌ కోసం ఒక్కొక్కరికి రూ.1,20,000 వరకు సాయం చేసింది గ్రామీణాభివృద్ధి శాఖ. వారంతా పందిర్ల పై కాకర, దొండ, బీర వంటి కూరగాయలు పండిస్తూ సూక్ష్మ సేద్యం చేయసాగారు. ఒక్కో రైతు వీటి అమ్మకాలపై నెలకు సుమారు రూ. 25 వేలకు పైగా ఆదాయం పొందుతున్నారు. వచ్చిన ఆదాయంలో కొంత పొదుపు చేసి బొప్పాయి పండ్లసాగు కూడా మొదలుపెట్టారు.ఉపాధి హామీ పథకం వీరికి సుస్ధిర జీవనోపాధిని కల్గించింది.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *