బ్రాండిక్స్‌ కొన్ని నిజాలు – 1

The impact of brandix sez in Visakhapatnam by ruralmedia

బ్రాండిక్స్‌ కొన్ని నిజాలు – 1
…………………………………. 
The impact of brandix sez in Visakhapatnam by ruralmedia -1విశాఖపట్నానికి ఆరవై కిలోమీటర్లదూరాన తూర్పు కోస్తాతీరంలోఅచ్యుతాపురం మండలంలో ఎపీసెజ్‌లో 2005లో అంతర్జాతీయ దుస్తుల తయారీ సంస్థ  brandix India Apparel City pvt.ltd ఏర్పాటయింది. 
బ్రాండిక్స్‌ వల్ల స్థానికులకు ఏం జరిగింది? ఉపాధి అవకాశాల పట్ల ఉన్న అపోహలను తొలగించి సంస్థకు స్థానికులకు మధ్య చక్కని వాతావరణాన్ని కల్పించడం కోసం ఈ నిజనిర్దారణ సర్వే నిర్వహించడానికి కంపెనీలో ఆపరేటర్లగా పనిచేస్తున్న మహిళలతో పాటు అచ్యుతాపురం మండలంలోని ఎనిమిది గ్రామాలు,దువ్వాడ, అనకాపల్లి,విశాఖపట్నంలోని పలువురిని కలిసి మాట్లాడాం. 
కొన్ని వారాల పాటు ‘రూరల్‌మీడియా ‘ బృందం ఈ సర్వేలో పాల్గొంది. 
బ్రాండిక్స్‌ వల్ల స్ధానికుల జీవన ప్రమాణాలు పెరిగాయా? 
ఉపాధి అవకాశాలు అందరికీ కలిగాయా? 
కంపెనీ ఇస్తున్న వేతనాలు కనీసఅవసరాలను తీరుస్తున్నాయా? 
మహిళాఆపరేటర్లు పనిచేస్తున్న చోట ఎలాంటి సౌకర్యాలున్నాయి? 
నిర్వాసితుల కాలనీలో అభివృద్ధి కార్యక్రమాల తీరుతెన్నులు… మొదలైన అంశాలపై ఈ సర్వే జరిగింది. దీనిలో వెల్లడయిన అంశాలను మీ ముందుంచుతున్నాం. 
సానుకూల అంశాలు … 

The impact of brandix sez in Visakhapatnam by ruralmedia

The impact of brandix sez in Visakhapatnam by ruralmedia


1 బ్రాండిక్స్‌ వల్ల స్థానికుల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. అచ్యుతాపురం మండలంతో సహా దువ్వాడ,అనకాపల్లి వంటి బయట ప్రాంతాల మహిళలకు జీవనోపాధి దొరికింది. 
2, బ్రాండిక్స్‌ కంపెనీ రాక ముందు ఇంట్లో మగవారి సంపాదన మీద మాత్రమే ఆధారపడే వారు. కంపెనీ వల్ల మహిళలకు ఉపాధి ఏర్పడి ఆదాయాలు పెరిగాయి. 
3, అచ్యుతాపురం చుట్టుపక్కల గ్రామాలన్నీ వ్యవసాయం మీద ఆదారపడినవి. పేదరికం ఎక్కువ. ఎంత ఎక్కువంటే పదో తరగతి తరువాత పై చదువులు చదివే 
స్తోమతు లేని వారు ఎక్కువ. అక్కడితో చదువులు ఆపేసిన అమ్మాయిలు పొలం పనులకు వెళ్లడం లేదా ఇంట్లో కుట్లు,అల్లిలుతో బతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్రాండిక్స్‌ రావడం వారికి గొప్ప ఆలంబన.చదువులు ఆగిపోయినా ఉపాధి దొరకడంతో తల్లిదండ్రులకు పిల్లలు భారం కాలేదు. 
4, తరతరాలుగా వ్యవసాయం మీదే ఆధార పడి బతుకుతున్న కుటుంబాలు తమ ఇంట్లో ఒకరికి ఉద్యోగం రావడం తో సామాజిక హోదా పెరిగిన భావన కలిగింది. 
5, ఇక్కడ పని చేస్తున్న వారిలో ఎక్కువ శాతం అవివాహితులే. వీరి సంపాదనలో కొంత పొదుపు చేసి వివాహ ఖర్చులకు దాచుకుంటున్నారు. దీనివల్ల దల్లిదండ్రులకు కొంత ఆర్థిక భారం తగ్గిస్తున్నారు. 
6, బ్రాండిక్స్‌ ఏర్పాటు కాక ముందు ఈ ప్రాంతంలో 30శాతం మహిళలు బతుకు తెరువు కోసం విజయవాడ,హైదరాబాద్‌లకు పోయేవారు.కొందరు కుట్టుపనిలో శిక్షణ కోసం బయట ప్రాంతాలకు వెళ్తుండే వారు. కంపెనీ వచ్చాక ఉన్న ఊర్లోనే ఉపాధి దొరకడంతో వారంతా వెనక్కు వచ్చారు.దీనివల్ల వలసలు తగ్గాయి. 
7, రోజూ అందరితో కలిసి బస్సులో పనికి పోయి రావడం వల్ల తమ భావాలను నలుగురిలో పంచుకునే ఆవకాశం కలుగుతుంది. ఉద్యోగాలు చేస్తున్నందు వల్ల వారికి గ్రామాల్లో గౌరవం పెరిగింది. 
8, పనిలో నైపుణ్యం పెంచుకోవడం వల్ల బ్రాండిక్స్‌లో ఏర్పాటయిన ఇతర సంస్థల్లో ఎక్కువ జీతానికిఉద్యోగాలు 
దొరికే అవకాశాలు కలిగాయి. 
9, విశాఖపట్నం జిల్లాకు చెందిన ఆరువేల మందికి ఈ సంస్థలో ప్రత్యక్ష ఉపాధి కల్పించారు. మనరాష్ట్రంలో ఏర్పాటయిన ఏ సెజ్‌లోనూ ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగాలు లేవు. 
10, ప్రతీరోజూ 60 బస్సులు గ్రామాల నుండి ఉద్యోగులను కంపెనీకి చేరవేస్తున్నాయి.దీని వల్ల పరోక్షంగా డ్రైవర్లకు,ట్రాన్స్‌పోర్ట్‌ ఏజెన్సీలకు ఉపాధిఅవకాశాలు కలిగాయి. క్యాంటిన్లు,సెక్యూరిటీ నిర్వహణలో మరో 275మందికి ఉపాధిదొరికింది. 
 ( ప్రతికూలాంశాలు.. రేపు )   .

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *