ప్రత్యక్ష సాక్షులు

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రత్యక్ష సాక్షులు
………………
సక్రుతండాకు చెందిన సరోజ,తిమ్మాపురంలో రజిత,భూపాల్‌ పల్లి నుండి సుజన,చిలుపూరులో లత,కొనపర్తిలో స్వరూప… ఇలా ఎందరో. పండిన పంటకు గిట్టుబాటు లేక, అప్పుల పాలైన భర్తలు లోకాన్ని వదిలి పోతే, ఒంటరిగా మిగిలిన ఈ స్త్రీల జీవనచిత్రాన్ని క్యాప్చర్‌ చేసిన ఫొటోజర్నలిస్ట్‌ విజయ్‌ జోధా . The First Witness Photo Exhibition by Vijay Jodha 1
1995 నుండి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 3 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దానికి ప్రత్యక్ష సాక్షులు వారి భార్యలే… ఎండా, వానలో పనిచేస్తూ, మట్టినుండి బంగారం వంటి పంటలు పండించడంలో భర్తతో పాటు నడిచిన ఆమె ఒక్కసారి తనకు తోడున్న వ్యక్తి మాయమైతే, జీవితాన్ని ఎలా తల్లడిల్లి పోతుంది. వారి బతకు చిత్రాలే ఈ ఫోటో ప్రదర్శన.

The First Witness Photo Exhibition by Vijay Jodha

The First Witness Photo Exhibition by Vijay Jodha

కొంతకాలం క్రితం, దేశరాజధాని ఢిల్లీలో దేశం నలుమూలల నుండి వచ్చిన వితంతు మహిళలు నాయకులకు,మీడియాతో తమ బాధలు పంచుకున్నారు. వారంతా ఆత్మహత్య చేసుకున్న రైతుల భార్యలు. రైతుల సమస్యలు పరిష్కరిస్తే ఆత్మ హత్యలుండవు అనేది వారి ఆందోళన. వారిలో తెలంగాణ నుండి వెళ్లిన వారు కూడా ఉన్నారు. వారి కష్టాలను,దైన్యాన్ని తన కెమేరాతో క్యాప్చర్‌ చేశారు ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ విజయ్‌ ఎస్‌ జోదా. ఇటీవల దాదాపు వంద ఫొటో గ్రాఫ్‌లను హైదరాబాద్‌లోని జర్మన్‌ సెంటర్‌లో ప్రదర్శించారు.
గుర్గావ్‌(హర్యానా)కు చెందిన విజయ్‌ ఎస్‌ జోదా. రచయిత,డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్‌. ఆయన స్కూల్‌ నుండి కాలేజీవరకు హైదరాబాద్‌లో చదివారు. న్యూయార్క్‌లో డాక్యుమెంటరీ మేకింగ్‌ పై అధ్యయనం చేశారు. దర్శకులు అంగ్‌లీ, మీరా నాయర్‌లతో కలిసి పనిచేశారు. మీడియా ద్వారా సమాజ మార్పుకు దోహద పడుతున్నందుకు మీడియా సిటిజన్‌ అవార్డు పొందారు. ‘ రైతులు ఆత్మహత్యల వెనుక ఎన్ని కారణాలున్నా, ప్రధానంగా దేశానికి ఆహారం పెట్టే రైతును కోల్పోవడం అతి పెద్ద విషాదం. వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం అందరిపై ఉంది. ఈ ఫోటోల వల్ల వారి బతుకుల పై సానుభూతి కలిగి మన వ్యవస్దలో కొంతైనా మార్పు వస్తుందని భావిస్తున్నాను ‘ అంటారు విజయ్‌.

Share.

Leave A Reply