ఫాంహౌస్‌ వెనుక, ఒక ప్రగతి…

Google+ Pinterest LinkedIn Tumblr +

ఫాంహౌస్‌ వెనుక, ఒక ప్రగతి…
తోడికోడళ్లు… ఇది టీవీసీరియల్‌ టైటిల్‌ కాదు, జీవన పోరాటం.
తుమ్మల సునీత పశుల కొట్టంలో పేడ ఎత్తడం నుండి గ్రాస్‌ కట్టర్‌తో గడ్డిని కోసి గేదెలకు వేసే పనులన్నీ చేస్తుంది. అంతే కాదు,తోడి కోడలు కృష్నవేణి సాయంతో 12 బర్రెల పాలు పిండి భర్తకు అందిస్తుంది.గంగాధర్‌ రోజూ వాటిని 90కిలోమీటర్లు దూరంలోని బంజారాహిల్స్‌ కస్టమర్లకు అందిస్తాడు.గేదె పాలకు అధిరిపోయే డిమాండ్‌,రోజుకు 50 లీటర్లు అమ్ముతున్నారు. ఖర్చులన్నీ పోను నెలకు రూ75 వేలు ఆదాయం. కేవలం ఒకే ఒక్క బర్రెతో మొదలైన వారి ప్రస్థానం వెనుక చాలా మలుపులున్నాయి. ”ఉద్యోగాల్లోనే జీవితాన్ని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. నచ్చిన పనిలో సౌభాగ్యం, పదిమందికి పనికొస్తున్నామన్న సంతోషం ఉంది.” అంటున్నారీ దంపతులు.
ఈ ముచ్చట మీతో షేర్‌ చేసుకోవడం వెనుక అసలు కథ ఉంది.
నిన్న ఎర్రవల్లిలో సీఎం సారుని ఫాం హౌస్‌లో కలుద్దామని ట్రై చేశాం కానీ, మాకు అప్పాయింట్‌ మెంట్‌ దొరకలేదు. దాంతో ఫాంహౌస్‌ సమీపంలోని ఈ తోడి కోడళ్లను కలిశాం. ఆ విధంగా ఈ సక్సెస్‌ స్టోరీని కేసీఆర్‌ మాకు ప్రసాదించారు.

Share.

Leave A Reply