ఆకుపచ్చని సూరీడు

Daripalli Ramaiah

ఆకుపచ్చని సూరీడు అతడే…
మీ కోసం ఎవరో పెద్దాయన వచ్చాడు. సెక్యూరిటీ దగ్గర ఉన్నాడు అని కబురు రాగానే కిందికి వెళ్లాను. నలిగి పోయిన దుస్తుల తో మెడలో ‘చెట్లు ప్రగతికి మెట్లు ‘ లాంటి స్లోగన్స్‌ ఉన్న అట్టలు వేలాడేసుకొని బ్యాగ్‌లో విత్తనాలు,మొక్కలతో నడుస్తున్న నేరేడు చెట్టులా ఉన్నాడాయన. కొండలు,గుట్టలు మీద, రోడ్లపక్కన లక్షలాది మొక్కలు పెంచానని, ఖమ్మం బీడు భూముల్లో విత్తనాలు చల్లుతున్నానని అతను చెబుతుంటే సెక్యూరిటీ వారు ఎగతాళిగా చూస్తున్నారు. రేపటి తరం కోసం అతను పడుతున్న తపన నన్ను కదిలించింది.
మర్నాడు ‘ హరిత రామయ్య’ కథనం ఆంధ్రజ్యోతిలో అచ్చయింది.
ఇదంతా 2003 నాటి ముచ్చట.
చెట్లను నరకడం తప్ప నాటడం ఎరగని వ్యవస్ధలో కోట్ల మొక్కలు నాటిన దరిపల్లి రామయ్యకు ఇంతకాలానికి పద్మశ్రీ ఇవ్వడం పెద్ద గుర్తింపేమీకాదు, కానీ ప్రభుత్వానికి దక్కిన అరుదైన గౌరవం ఇది.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *