చెట్టు చెప్పిన 1908 నాటి ముచ్చట

Google+ Pinterest LinkedIn Tumblr +

చెట్టు చెప్పిన 1908 నాటి ముచ్చట
మూసీ నదికి ఉత్తరాన, ఉస్మానియా జనరల్‌హాస్పిటల్‌లో ఉన్న 200 ఏళ్లనాటి చింత చెట్టుకు చరిత్రలో విశిష్ట స్థానం ఉంది. 110ఏండ్ల క్రితం హైదరాబాద్‌లో జరిగిన విపత్తును ఆ చెట్టు ఇలా వివరిస్తుంది…
” నిజానికి ఒకప్పుడు నేనున్న స్థలమంతా ఓ ఉద్యానవనంగా ఉండేది. ఆసుపత్రికిస్థలం అవసరమవ్వడంతో అదంతా ఆసుపత్రి స్థలంలో కలిపేశారు. సరే అసలు కథలోకి వద్దాం…
సరిగ్గా నూటపదేళ్ల క్రితం, 1908 సెప్టెంబర్‌ 28న, హైదరాబాద్‌ నగరాన్ని మూసీ వరదలు ముంచెత్తాయి. కేవలం 48 గంటల్లో 15వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. 80 వేల ఇళ్లు కూలిపోయాయి. అఫ్జల్‌గంజ్‌ ప్రాంతంలో 10 అడుగుల ఎత్తులో నీరు ప్రవహించింది. నగరంలో మూడోవంతు నామరూపాల్లేకుండా దెబ్బతింది.

Old tamarind tree in Osmania Hospital saved over 150 people during the Great Musi Flood

Old tamarind tree in Osmania Hospital saved over 150 people during the Great Musi Flood

ఆనాటి వరదల్లోసుమారు 150 మంది నా నీడకు చేరారు. వరద నీరు చుట్టుముట్టటంతో నా కొమ్మల పైకి ఎక్కి ప్రాణాలుకాపాడుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని చెట్లను ఎక్కిన వారు, కూకటివేళ్లతో సహా ఆ చెట్లు కూలిపోయి వరదకుబలై పోయినా, నా మీద ఉన్నోళ్లు మాత్రం సురక్షితంగా బతకి బయట పడ్డారు. రెండురోజుల పాటు, తిండీ తిప్పలు లేకుండా నా దగ్గరే ఉండి పోయారు . నా వయస్సు సుమారు 400 ఏళ్ళని చరిత్రకారులు భావిస్తున్నారు. నేటికీ మీ మధ్య సజీవంగా ఉండి మీకు ప్రాణవాయవును పంచుతున్నాను. నా సేవలకు గుర్తుగా ఓఫలకాన్ని కూడా నాకు అమర్చారు. నాకు ‘వారసత్వ’ హోదా ఇప్పించేప్రయత్నాలూ జరిగాయి. ఒకప్పుడు ఈ ప్రాంతంలో అఫ్జల్‌గంజ్‌ ఆసుపత్రి ఉండేది. మూసీ వరదల్లో అది దెబ్బ తినడంతో 1924లో ఏడో నిజాం అక్కడఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌ను నిర్మించారు. నన్ను గౌరవిస్తూఏటా నవంబర్‌ 30న హాస్పిటల్‌ డేను ఆసుపత్రి సిబ్బంది నిర్వహిస్తుంటారు. ప్రముఖ కవి రావూరి భరద్వాజ నన్ను ‘ప్రాణధాత్రి’గా అభివర్ణించారు.
ఇప్పటి మూసీకి ఎంతో భిన్నం ఆనాటి మూసీ. అందుకేమహమ్మద్‌ కులీ కుతుబ్‌ షా మూసీ తీరం ఒడ్డున హైదరాబాద్‌ నగరాన్నినిర్మించారు. నదీతీరాల్లోనే ప్రపంచంలోని మానవ నాగరికతలన్నీ అభివృద్ది చెందిన విధంగా హైదరాబాద్‌ కూడా అలాగే రూపుదిద్దుకున్నది. మూసీకి వరదలు రావడం కొత్తేమీ కాదు. ఆ విషయాన్ని దష్టిలోఉంచుకునే ఒడ్డుకు అరకిలోమీటరు దూరం వదిలి కట్టడాలు నిర్మించారు. ప్రతీ 20లేదా 30 ఏళ్లకోసారి మూసీలో నీటిమట్టం గణనీయంగా పెరిగి వరదగామారుతుంటుంది. అయితే సాధారణంగా అది కట్టలు దాటి వచ్చేది కాదు. .
నిజాం నవాబుల కట్టడాలన్నీమూసీ దక్షిణ ప్రాంతంలోనిపాతబస్తీలోనే ఉండేవి. ఉత్తర దిశలో చాదర్‌ఘాట్‌ వైపు కొత్తపట్టణం రూపుదిద్దుకుంది. మూసీ నదికి సుమారుగా 4 మైళ్ళ దూరంలో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉండేది.
ఆ రోజు ఏం జరిగింది?
సెప్టెంబర్‌ 28. 1908, మధ్యాహ్నం 11 గంటలయ్యేసరికల్లా నదినీటిమట్టం పెరగ సాగింది. సాయంత్రం 4 గంటలకు తుంపరగా మొదలైన వర్షం, రాత్రి 11.30 గంటలకు కుండపోతగా మారింది. . అప్పటికే మూసీ పరివాహకప్రాంతంలోని చెరువులన్నీ నిండిపోయాయి. అలాంటి సమయంలోకురిసిన భారీ వాన చెరువుల కట్టలు తెంపేసింది. మూసీలో నీటి మట్టం 20 అడుగులకు చేరుకుంది. ఇపుడున్న ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌ ప్రాంతంలోఇళ్లలోకి నీరు చేరడం మొదల్కెంది. పురానాపూల్‌ వెనుకతట్టులోకి నీరు చొచ్చుకురావడంమొదలై, పశ్చిమ దిశలోని నగర రక్షణ గోడకూలిపోయింది.
కోల్సావాడి ప్రాంతంలో సుమారు రెండు వేల మంది వరదలో చిక్కుకుపోయారు. మూసీ ఒడ్డున ఇళ్లు అన్నీకూడా దాదాపుగా నేలమట్టమ్కెపోయాయి. మనుషులను, ఆస్తిపాస్తులనే కాకుండాఎనలేని చారిత్రక ప్రాధాన్యం ఉన్న అపార వారసత్వ సంపదను కూడాకోల్పోయింది.
వరదల నివారణకు రెండు జలాశయాలు
వరద పరిస్థితులను చూసి, ఇకపై ఇలాంటి దుస్థితి తలెత్తకుండా చూడాలని నిజాం, నాటి సుప్రసిద్ధ ఇంజినీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను రప్పించారు.రెండు జలాశయాలు నిర్మించాలని, డ్క్రెనేజీ వ్యవస్థను ఆధునికీకరించాలని విశ్వేశ్వరయ్య సూచించారు. ఆయన సూచనల అనువుగా 1920లో ఉస్మాన్‌సాగర్‌, 1927లో హిమాయత్‌సాగర్‌లను నిర్మించారు. ఇవి నగరానికి వరద ముప్పును తప్పించడమే గాకుండా మంచినీటి వసతినీ కల్పిస్తున్నాయి.
నిజాం ఏం చేశారు?
మూసీ వరదల సమయంలో నిజాంగా మీర్‌ మహబూబ్‌ అలీపాషాఉన్నారు. బాధితులను ఆదుకున్నారు. 1911లో చివరి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌గద్దెనెక్కారు. 1908 నాటి విపత్తు మరో సారి రాకుండా నగరంలో మౌలిక వసతుల అభివద్ధికి ప్రణాళికలు రూపొందించారు.
వరదల తరువాత మూసీనదికి రెండు పక్కలా రక్షణ గోడలను నిర్మించారు. మూసీ తీరం వెంట హైకోర్టు, సిటీ కాలేజీ, ఉస్మానియా హాస్పిటల్‌,అసఫియా ల్కెబ్రరీ లాంటి కట్టడాలు రూపుదిద్దుకున్నాయి.
మూసీ నది హైదరాబాద్‌ చరిత్ర, సంస్కతిలో విడదీయలేని భాగం.మూసీ లేనిదే హైదరాబాద్‌ లేదనేది ఒకప్పటి మాట. నేడు మ నగరంమధ్యలో మూసీ మురికి కాలువ ఎందుకు ఉన్నదా అని చిరాకు పడే స్ధితికి మూసీ మారి పోయింది..” అని ముగించింది చింత చెట్టు.
……………………………………………………………………………………………………………….
మూసీ నది ఎక్కడ పుట్టింది?
రంగారెడ్డి జిల్లా అనంతగిరి కొండల్లో చిన్న పాయగా మూసీ నది పుట్టింది. దీని అసలు పేరు ‘ముచుకుందా నది’. 240 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తూ, ప్రతాప్‌సింగారం, యాలాల్‌, సూరాయపల్లి, పొద్దుటూరు, రావులపల్లి, చిన్నమంగ ళారం, గోపులారం, ఉస్మాన్‌సాగర్‌, లంగర్‌హౌజ్‌, కార్వాన్‌, సాలార్‌జంగ్‌ మ్యూజియం, మలక్‌పేట్‌, ముసారాంబాగ్‌, రామంతాపూర్‌, అంబర్‌పేట్‌ మీదుగా నల్గొండ జిల్లాలోకి వస్తుంది. నల్గొండ జిల్లా వాడపల్లి దాటిన తరువాత హుజురాబాద్‌ వద్ద తిరిగి క ష్ణా నదిలో విలీనం అవు తుంది. రంగారెడ్డి జిల్లా నుండి హైదరాబాద్‌లోకి ప్రవేశించిన తరువాత పశ్చిమంగా 90 కిలో మీటర్ల మేర ప్రవహిస్తుంది. ఆ తరువాత నల్గొండ జిల్లాలోకి అడుగుపెడ్తుంది.

……………………………………………………………………………………………………………..

( This article is presented under RuralMedia-Nirmaan partnership )

Share.

Leave A Reply