చుక్క నీరు లేని చోట సుక్కమ్మ సేద్యం

Telangana Tribal’s Restore Water Flow with Nabard Support

చుక్క నీరు లేని చోట సుక్కమ్మ సేద్యం
బుస్సాపూర్‌ (ఏటూరి నాగారం సమీపం,జయశంకర్‌ జిల్లా) అడవిలో అడుగేస్తే … బుసలు కొడుతూ నాగులు పలకరిస్తాయి. వాగులు, నాగులు, వంకలు దాటి అరగంట నడిస్తే రెండెకరాల మామిడి తోటకు నీళ్లు పెడుతున్న సుక్కమ్మ కుటుంబం కనిపించింది. బొబ్బర్లు,పల్లీ అంతర పంటలు వేశారు. ఈ చిట్టడివిలో
కొండ గొర్రెలు,కోతుల నుండి పంటను కాపాడుకోవడానికి ఈ కోయ ఆదివాసీలు నిరంతర ం కాపలా ఉండాల్సిందే… రెండేళ్ల క్రితం వీరిని కలిసినపుడు పొలం దిగువన చిన్న నీటి కుంటను తవ్వుతూ కనిపించారు. ఇపుడు జలకళతో జీవంతో తొనికిస లాడుతున్న ఈ నీటి చెలమ అప్పటి వారి శ్రమ ఫలం. దట్టమైన అడవుల మధ్య నుండి వచ్చే సెలయేళ్ల తేటదనం చూస్తుంటే నేల కోతకు గురి కాలేదని అర్ధం. ఎండిన బావులు, అడుగంటిన జలాలున్న పరిస్ధితుల్లో కూడా చెక్కు చెదరని ఈ నీటి చెలమ వీరి భవిష్యత్‌ ప్రత్యక్ష చిత్రనటం.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *