ఆదర్శ ఐఏఎస్‌ లకు ఎక్సలెన్స్‌ అవార్డులు

Telangana State government has announced the Telangana Excellence(TEX) Awards-2017 for IAS Officers

ఆదర్శ ఐఏఎస్‌ లకు ఎక్సలెన్స్‌ అవార్డులు
సివిల్‌ సర్వీసెస్‌ అధికారులకు ఎక్సలెన్స్‌ అవార్డులు
భూపాలపల్లి కలెక్టర్‌ మురళి, జనగామ జిల్లా కలెక్టర్‌ దేవసేనకు పురస్కారాలు
నిత్యం గ్రామాల్లో ఫీల్డ్‌విజిట్‌ చేస్తూ, ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భుజంతట్టి ,ముందుకు సాగమని గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తోంది. పరిపాలనలో, విధి నిర్వహణలో ఆదర్శంగా నిలుస్తూ, సరికొత్త ప్రణాళికతో ముందుకెళ్తున్న ఐఏఎస్‌ అధికారులను ఎక్సలెన్స్‌ అవార్డులతో సత్కరించబోతుంది. ఇందులో భాగంగా ఇన్నోవేషన్‌, సాధారణ విభాగాల్లో అధికారులను ఎంపికచేసింది. ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికలకు ఆత్మరక్షణ కార్యక్రమం నిర్వహించినందుకు జనగామ జిల్లా కలెక్టర్‌ దేవసేన, నిస్సహాయ స్థితిలో ఉన్న పిల్లలకు పునరావాస కల్పన కోసం క షి చేసినందుకు నిజామాబాద్‌ కలెక్టర్‌ యోగితారాణా, జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల  పై ప్రజల్లో నమ్మకం కలిగించినందుకు జయశంకర్‌ భూపాలపల్లి కలెక్టర్‌ ఎ.మురళి, జగిత్యాల జిల్లా కలెక్టర్‌ శరత్‌ ఎక్సలెన్స్‌ అవార్డులకు ఎంపికయ్యారు.

Jayashankar Bhupalapally district collector A.Murali

Jayashankar Bhupalapally district collector A.Murali

ఐటీడీఏల్లో స్టార్స్‌ – 30 కార్యక్రమాన్ని అమలుచేసినందుకు ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ జ్యోతి బుద్ధప్రకాశ్‌, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్వీ కర్నన్‌ అనురాగ్‌ జయంతి, డీపీఎంఎస్‌ (డెవలప్‌మెంట్‌ పర్మిషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం) కార్యక్రమానికిగాను హెచ్‌ఎండీఏ కమిషనర్‌ చిరంజీవులుకు ప్రభుత్వం ఇన్నోవేషన్‌ క్యాటగిరీలో అవార్డులను ప్రకటించింది.
మిషన్‌ కాకతీయ,హరితహారం అమలులో…
ప్రభుత్వం చేపట్టిన పలు నూతన పథకాలను విజయవంతంగా అమలుచేసి ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు కూడా ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. ఈ క్యాటగిరీలో మిషన్‌ భగీరథ కార్యక్రమానికి సిద్దిపేట్‌ కలెక్టర్‌ వెంకటరామరెడ్డి, మిషన్‌ కాకతీయకు భద్రాది కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు, కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్‌ పథకానికి ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ జ్యోతి బుద్ధప్రకాశ్‌, జాయింట్‌ కలెక్టర్‌ క ష్ణారుడ్డి, ఆర్డీవో సీహెచ్‌ సూర్యనారాయణ, సూపరింటెండెంట్‌ ఆర్‌ అరవిందకుమార్‌, తెలంగాణకు హరితహారం కింద సూర్యాపేట కలెక్టర్‌ సురేంద్రమోహన్‌, వరంగల్‌ రూరల్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ జే పాటిల్‌, ఆరోగ్యలక్ష్మి పథకానికి నల్లగొండ కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ అవార్డులు అందుకోనున్నారు.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *