ప్రజల చెంతకు పాలన

Kisan Mitra Helpline poster inaugurated by District Collector D Divya

ప్రజల చెంతకు పాలన
 పరిగెడుతున్న పథకాలు – కలెక్టర్లకు లక్ష్యాలపై స్పష్టత
జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ – కొత్త జిల్లాలు ఏర్పడి ఏడాది
గోవిందరావుపేట మండల్‌,బుస్సాపూర్‌ రైతుల పంటపొలాలకు సరైన రహదారి లేదు.వైద్యసదుపాయం లేదు. సమస్యలు చెప్పుకోవడానికి జిల్లా కలెక్టర్‌ని కలవాలంటే 160కి.మీ. వరంగల్‌ పోవాల్సి వచ్చేది.  ఒక రోజు కూలీ పోయే,సమయం పాయే. ఇప్పుడు 50కి.మీ.దూరంలో భూపాల్‌పల్లి జిల్లా కేంద్రమైంది. పల్లె ప్రజల సమీపంలో పాలన వచ్చింది.
సిద్దిపేట నుంచి మెదక్‌ జిల్లా కేంద్రం సంగారెడ్డికి 135 కి.మీ. ఒక రోజంతా అధికారుల కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. ఇప్పుడు కలెక్టరే సిద్దిపేట లో కొలువుదీరారు.
తాండూరు నుండి రంగారెడ్డి జిల్లా కేంద్రానికి 130 కి.మీ. 3 గంటల ప్రయాణం. ఇప్పుడు వికారాబాద్‌కే కలెక్టరేట్‌ వచ్చింది.ప్రజలు ఒక పూటలో పని చూసుకొని ఇంటికి చేరుకుంటున్నారు.
జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ జిల్లా కలెక్టర్లను ప్రజలకు దగ్గర చేసింది.
పాలన ప్రజల గడప తొక్కింది
కొత్తగా 21 జిల్లాలు రావడంతో డివిజన్‌ కేంద్రాల దూరంలోకి జిల్లా కేంద్రాలు వచ్చేశాయి. గతంలో పెద్దజిల్లాలో కలెక్టర్‌కు అన్ని మండలాలు సందర్శించే పరిస్దితి కూడా ఉండేది కాదు. ఇపుడు జిల్లా కేంద్రం గరిష్ట దూరం65 కిలోమీటర్లు.అంటే రెండున్నర గంటల ప్రయాణం. గతంలో ద్వితీయ శ్రేణి పట్టణాలు జిల్లా కేంద్రాలుగా మారడంతో అభివృద్ధి కేంద్రాలవుతున్నాయి. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్‌వ్యవస్థీకరణ జరిగి ఏడాది గడిచిన సందర్భంగా రూరల్‌ మీడియా ఫోకస్‌.
కలెక్టర్లకు దిశా నిర్దేశనం
కొత్త జిల్లాలు ఏర్పడగానే  ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్య జిల్లా సమగ్ర సమాచారాన్ని కలెక్టర్ల చేతుల్లో పెట్టారు.

Know your district plan your district (మనజిల్లా,మన ప్రణాళిక) అంటూ ఇంగ్లీషు,తెలుగులో సమగ్రాభివద్ధి ప్రణాళికను పాలనాధికారులకు అందించారు. ఈ ప్రణాళిక ప్రకారం యువ కలెక్టర్లు అభివృద్ది పథం వైపు అడుగులు వేస్తున్నారు.

vikarabadCollector D.Divya ,subcollectorSandeep attended Awareness Programme organized by District Rural Development Agency under Swachh Bharath Mission

vikarabadCollector D.Divya ,subcollectorSandeep attended Awareness Programme organized by  Swachh Bharath Mission (Rural) at Peddemul

డివిజన్‌ స్థాయికే జిల్లా చేరడంతో కొందరు కలెక్టర్లు తెల్లారగానే గ్రామాల్లో కి చేరుకుంటున్నారు.
వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ D.దివ్య, సబ్‌కలెక్టర్‌ సందీప్‌ ఇతర అధికారుల సమన్వయంతో ఆదివాసీల అభివృద్ధి కోసం ‘చెంచుల చైతన్యం’ అనే వినూత్న కార్యక్రమం చేపట్టి గిరిజనపల్లెలో మౌలిక వసతులపై దృష్టిపెట్టారు. రైతన్నలకు భరోసా కల్పించే ‘కిసాన్‌ మిత్ర’ హెల్ప్‌ లైన్‌ (18001203244) ఏర్పాటు చేసి రైతుల సమస్యలు పరిష్కరిస్తూ ఆత్మ హత్యల నుండి కాపాడుతూ, మిగతా జిల్లాలకు ఆదర్శంగా నిలిచారు.అంగన్‌ వాడీ బాలలకు పౌష్టికాహారం అందించే ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.
మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రీతీమీనా ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ల సమస్యను పరిష్కరించారు.ఆర్డీవో కృష్ణవేణితో కలిసి టూ వీలర్‌ మీద మారు మూల గ్రామాలకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నారు. 24గంటలు పనిచేసే ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటు చేశారు. పాఠశాలల్లో విద్యార్ధుల హాజరు శాతం మెరుగు పడి ఫలితాలు పెరిగాయి.గ్రామాల్లో కనీస వసతుల పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

Mahabubabad Collector Preethi Meena attended at hospitals

Mahabubabad Collector Preethi Meena attended at hospitals

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ ఎ.మురళి అయితే సైకిల్‌పైనే ఆదివాసీల తండాలకు వెళ్లి గిరిజనుల సమస్యలు తెలుసుకుంటున్నారు.తనతో పాటు తమ కుటుంబ సభ్యులను కూడా ప్రభుత్వాసుపత్రులకు తీసుకొసూ ్త ప్రభుత్వవైద్యం పై ప్రజల్లో విశ్వాసం పెంచారు.
కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం సమస్యలకు పరిష్కారాలు దొరుకుతున్నాయి. ప్రభుత్వ పథకాలను కలెక్టర్లు పోటీపడి అమలు చేస్తున్నారు. ‘గ్రీవెన్స్‌ డే(మీకోసం) వంటి కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో జరుగుతున్నాయి.
పెరిగిన పారదర్శకత
ఎక్కువ జిల్లాల్లో 20లోపు మండలాలే ఉండటంతో కలెక్టర్లు,ఇతర అధికారుల పర్యవేక్షణ
సులభమయింది.లక్ష్యాలను నిర్దేశించుకొని ప్రభుత్వకార్యక్రమాలు అమలు చేస్తున్నారు. పథకాలకు

Jayashankar bhupaalpalli collector Murali at tribal villege

లబ్దిదారుల ఎంపిక,ప్రయోజనాలు అందించడంలో పారదర్శకతకు జిల్లాకలెక్టర్లు ప్రాధాన్యమిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్నానాన్ని వినియోగించుకొని పారదర్శకపాలన అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.
జిల్లాల్లోని చారిత్రక వారసత్వ సంపద పరిరక్షణ పై దృష్టి పెరిగింది. ఆయా జిల్లాల్లోని పర్యాటక ప్రాంతాలకు ప్రాచుర్యం లభించేలా చేస్తూ పర్యటకులను ఆకట్టుకుంటున్నారు.. కనీస వసతులు,మౌలిక సదుపాయాల కల్పన పై దృష్టి పెట్టారు.ఇటీవల బాగా ప్రాచుర్యం పొందిన నాగర్‌ కర్నూల్‌ జిల్లా మల్లెల తీర్థం, జయశంకర్‌ భూపాల పల్లి జిల్లాలోని బొగత జలపాతం, లక్నవరం, రామప్ప చెరువు లు ఇందుకు నిదర్శనం.

(Team,RuralMedia)

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *