నిన్న స్వప్నం, నేడు సత్యం

Oora Cheruvu_Toopran Mandal_ in Medak District2

భారతీయ పల్లెల్లో ప్రతీ ఇద్దరు మహిళల్లో ఒకరు రోజూ నీళ్ల కోసం కనీసం ఆరు సార్లు తిరుగుతున్నారు.అలా ఏడాదికి రెండొందల కిలోమీటర్ల పైగా నడుస్తున్నారు. దీని వల్ల బతుకు తెరువును కోల్పోతూ పిల్లలను సంరక్షించలేక పోతున్నారు.
నీళ్లుంటేనే తిండీ,చదువూ,జీవనోపాధీ,జీవితం. ఏ రాజ్యానికైనా జలసిరులే జాతి సంపద.అదే లేనపుడు జనంలో నిరాశ,అసహనం. పాలకుల్లో అభద్రత మొదలవుతుంది. నీళ్లే అన్ని సమస్యలకు మూలం అని గ్రహించిన తెలంగాణ సర్కారు వానలు పడినపుడే ప్రతీ చుక్కను దాచుకోవాలని ‘మిషన్‌ కాకతీయ’ను మొదలు పెట్టింది.

చెరువుల్లో పూడిక తీసి జలసిరులను ఒడిసిపట్టింది. దాని ఫలితం ఇదిగో…
మెదక్‌ జిల్లా,తూప్రాన్‌, నర్సాపూర్  లో కొన్ని చెరువులు జలకళతో కళకళలాడుతూ రైతులింట సిరులు పండిస్తున్నాయి.

రూరల్‌మీడియా లెన్స్‌మేన్‌ కె.రమేష్‌బాబు క్లిక్‌ మనిపించిన దృశ్యాలివి.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *