‘ఎకో’ దంతుడు

Google+ Pinterest LinkedIn Tumblr +

‘ఎకో’ దంతుడు
(ఇంటి పెరట్లో నిమజ్జనం ,పర్యావరణ హితం)
వినాయకుడి విగ్రహాలు చెరువులో నిమజ్జనం చేయడం వల్ల పూడిక ఏర్పడి నీటిమట్టం తగ్గిపోతుందనేది టీవీ సుధాకర్‌ ఆలోచన. అందుకే మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలతో పాటు ఒక మొక్కను కూడా ఉచితంగా పంచుతూ పండుగను పర్యావరణ హితంగా మార్చి, చెరువులు,కుంటలు కాలుష్యం మయం కాకుండా కాపాడుతున్నారు.
గణపతి విగ్రహాలు ముంబాయి సముద్రం ఒడ్డుకు కొట్టుకు వస్తే, వాటిని మున్సిపాలిటీవాళ్లు చెత్తలా తీసి పారేయడం అతడు చూశాడు.. దానివల్ల అటు సముద్రం కలుషితమవడం, ఇటు పూజలు చేసిన వారికి తృప్తి లేక పోవడం అతన్ని ఆలోచింప చేసింది. ఇపుడు మట్టి విగ్రహంతో పాటు ఒక తులసి మెక్కను ఉచితంగా పంచుతూ ఇంట్లోనే ఎలా నిమజ్జనం చేసుకోవచ్చో ముంబాయిలో పని చేస్తున్న సుధాకర్‌ కు వివరించారు.
………….
” మాది మహబూబ్‌నగర్‌. అమ్మ వెంకటలక్ష్మి, నాన్న రామచంద్రరావు టీచర్లుగా చేసి రిటైరయ్యారు. అమ్మ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకుంది. నేను 1984లో బీఎస్సీలో గోల్డ్‌ మెడల్‌ తెచ్చుకున్నా. 1994లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)లో ఉద్యోగం రావడంతో ముంబై లో స్దిర పడ్డాం. 2013లో ఆర్‌బీఐలో జీఎంగా రిజైన్‌ చేసి, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌కు మారాను.
మట్టి గణపతి విగ్రహాల కోసం వెతికాను.. 
మా ఇంట్లో వినాయక చవితిని వైభవంగా జరుపుకోవడం అలవాటు.చిన్నప్పటి రోజుల్లో రసాయన రంగులు లేని, నీటిలో కరిగిపోయే మట్టి గణపతి విగ్రహాలనే పూజించేవాళ్లం. 1994లో ముంబై వెళ్లినప్పుడు,. పండుగకు మట్టి వినాయక విగ్రహం కోసం నగరమంతా వెతికాను. ఎక్కడా దొరకలేదు. ఆశ్చర్యమనిపించింది. ప్రతి ఏటా ఇదే పరిస్థితి. ఆర్‌బీఐలో పనిచేసేటప్పుటు మా క్వార్టర్స్‌ సముద్రం దగ్గర్లోనే ఉండేవి. ముంబయ్‌లో నిమజ్జనోత్సవం అంటే ఎంత సందడిగా జరుగుతుందో చెప్పనక్కర్లేదు. నిమజ్జనం తరువాత విగ్రహాలు సముద్రం ఒడ్డుకు కొట్టుకు వచ్చేవి. వాటిని మున్సిపాలిటీవాళ్లు చెత్తలా తీసి పారేసేవారు. ఈ ద శ్యం నా మనసును కలచివేసింది. అందరం భక్తి శ్రద్ధలతో పూజించిన దేవుని ప్రతిమ నీళ్లలో కరగక, తిరిగి ఒడ్డుకు వచ్చేస్తుంది. దానివల్ల అటు సముద్రం కలుషితమవుతోంది. ఇటు పూజలు చేసిన మనకు సంత ప్తీ మిగలడం లేదు. ఆ సంఘటన నన్ను ఆలోచనలో పడేసింది.

T V Sudhakar recalls the immersion of Ganapati clay idols at home

T V Sudhakar recalls the immersion of Ganapati clay idols at home

మట్టి విగ్రహం కోసం, నా అన్వేషణ గత ఏడాది ఫలించింది. ఓ షాపులో మట్టి విగ్రహం కనిపించింది. ఆరా తీస్తే… అతడు చెన్నై నుంచి తెచ్చి విక్రయిస్తున్నానని చెప్పాడు. అలా ఎట్టకేలకు మట్టి వినాయకుడి విగ్రహంతో ఇంట్లో పూజ చేశాను. అప్పుడే నిర్ణయించుకన్నాను… ఈ ఏడాది ఉత్సవానికి మట్టి గణపతి విగ్రహాలను ముంబైవాసులకు ఉచితంగా ఇవ్వాలని! ఆ క్రమంలోనే జనవరిలో వెయ్యి విగ్రహాలకు ఆర్డర్‌ ఇచ్చాను. వాటిని పంపిణీ చేయడం ఎలా? దాని కోసం ఓ వెబ్‌సైట్‌ రూపొందించి, రిజిస్ట్రేషన్లు ఓపెన్‌ చేశా. కానీ పెద్దగా స్పందన రాలేదు. నిరుత్సాహం కలిగింది. కానీ, ఈ విషయం తెలిసిన స్థానిక మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. దీంతో వెయ్యి విగ్రహాల పంపిణీ జరిగిపోయి, నా లక్ష్యం నెరవేరింది.
ఇంట్లో నిమజ్జనం ఎలా? 
ప్రక తి మనకెంతో ఇచ్చింది. దానికి మనమూ తిరిగి ఇవ్వాలి కదా! అందుకే ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను పంపిణీ చేశా. దాంతో పాటు తులసి మొక్క కూడా ఇచ్చా. అదెందుకంటే… నిమజ్జనం కోసం. మొక్కలను పెంచే కుండీలో నిమజ్జనం చేయడం వల్ల, విగ్రహం అరగంటలో కరిగిపోతుంది. ఆ మట్టి మొక్కకు ఉపయోగపడుతుంది. తులసి మొక్కనే కాదదు, ఆ కుండీలో కొత్తిమీర,పాలకూర వంటివి కూడా పెంచుకోవచ్చు. చాలా వరకు మట్టిని కాళ్లతో పిసికి అచ్చులు ఒద్ది విగ్రహాలు చేస్తుంటారు. నేను కేవలం చేతులతోనే ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నాను. ఒక్కో విగ్రహంలో అరకేజీ నుండి కేజీ వరకు మట్టి ఉంటుంది. అంతేకాదు… మనం అత్యంత భక్తితో కొలిచిన గణనాథుని నిమజ్జనం ఇంట్లోనే చేసుకోవడం వల్ల సంత ప్తి ఉంటుంది. చెరువులు కలుషితం కావు.
సొంత నిధులు ఖర్చు చేసి… 
ఇలా విగ్రహాలను తెప్పించడం, పంపిణీ కోసం రెండు లక్షల రూపాయలకు పైగా ఖర్చయింది. అదంతా నా సొంత డబ్బే. అయితే ఆత్మసంత ప్తితో పోలిస్తే అదేమంత పెద్ద
ఖర్చు కాదు. మట్టి గణపతుల పంపకానికి ముంబైవాసుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. పందిళ్ల మాటెలా ఉన్నా, కనీసం ఇళ్లలో పూజలు చేసుకొనేవాళ్లు మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించినా… పర్యావరణానికి ఎంతో మేలు చేసినవాళ్లమవుతాం. అలాగే హైదరాబాద్‌ ‘శివం’లో కూడా ఈ నెల 13న వెయ్యి మట్టి విగ్రహాలు పంపిణీ చేశాను. తొలి ప్రయత్నం విజయవంతం కావడం తో వచ్చే ఏడాది పది వేల మట్టి విగ్రహాలు ఉచితంగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా.” అని ముగించారు సుధాకర్‌.

– Shyammohan/ruralmedia/Nirmaan

Share.

Leave A Reply