ఇంటి ముంగిట బ్యాంకులు

Success stories of Village Level Entrepreneur

 ఇంటి ముంగిట బ్యాంకులు ( పల్లె సమగ్ర సేవా కేంద్రాలు)
మారు మూల ప్రాంతాల్లో బ్యాంకులు అందుబాటులో ఉండవు. బ్యాంకుల సేవలు పొందాలంటే కూలీనాలీ చేసుకునే పేదలకు దూరాభారమే, శ్రమ పడి సంపాదించిన దానిలో కొంత మొత్తం పొదుపు చేయాలంటే, మైళ్ల దూరంలో ఉన్న బ్యాంకులకు వ్యయ,ప్రయాసలకోర్చి పోవాలి. దీని వల్ల ఒక రోజు కూలీ నష్టపోవాల్సి వస్తోంది. ఇలాంటి సమస్యల నుండి ప్రజలను కాపాడడానికి’ స్త్రీనిధి’ విఎల్‌ఇలను ఏర్పాటు చేసింది. కొందరు ఎస్‌ ఎచ్‌ జి మహిళలను ఎంపిక చేసి వారికి బ్యాంకు లావాదేవీల్లో వారం రోజులు శిక్షణ ఇచ్చారు. ఇపుడు వీరు బ్యాంకులకు ప్రజలకు మధ్య వారధులుగా పని చేస్తూ, బ్యాంకు సేవలను ప్రజల ముంగిటకు తెస్తున్నారు. ‘స్త్రీనిధి’ నుండి పొందిన రుణాలు కూడా సకాలంలో ప్రజల నుండి సేకరించి బ్యాంకుల్లో జమ చేస్తున్నారు. ఇలా తెలంగాణలో 900 మంది విఎల్‌ఇలు పని చేస్తున్నారు. వికారాబాద్‌ జిల్లాలో 61మంది మహిళలువిఎల్‌ఇలుగా ఉపాధి పొందుతున్నారు. వీరి సేవలకు జమ చేసిన డబ్బులో కొంత కమిషన్‌ అందుతుంది. ఆ విధంగా వీరు స్వయం ఉపాధి పొందుతూ నెలకు రూ.20 నుండి 35 వేల వరకు సంపాదిస్తున్నారు. ఇలా స్వయం సమృద్ది సాధించిన ముగ్గురు మహిళల విజయ స్వరం ఇది…
ఉన్న ఊర్లో ఉపాధి
”నా పేరు భారతమ్మ, భర్త పేరు శివరాం. ఇద్దరు పిల్లలు. మా గ్రామం అంతారం(కుల్కచెర్ల మండలం, వికారాబాద్‌ జిల్లా) 2012 పొదుపు సంఘంలో చేరాను. మాది వ్యవసాయంపై ఆధార పడిన కుటుంబం. మాకు 3 ఎకరాల పొలం ఉంది. ఇంటర్‌ వరకు చదివాను. కానీ జీవనోపాధి లేదు. ఇలాంటి పరిస్థితిల్లో నాకు స్త్రీనిధి బ్యాంకు తరపున పల్లె సమగ్ర సేవా కేంద్రం లో వి. యల్‌. ఇ గా పని చేయడానికి అవకాశం వచ్చింది.
29 సంఘాల ప్రతి నెల పొదుపు మరియు లోనుకు సంబంధించిన డబ్బులను 3,00,000/-వరకు మా కేంద్రం లో నే చెల్లిస్తున్నారు . ప్రతి నెల రూ. 35,00,000/-ల వరకు లావాదేవీలు జరుగుతాయి, ఉపాధి హామీ చెల్లింపులు,డిపాజిట్లు, క్రాఫ్‌ లోన్‌ చెల్లింపులు మా కేంద్రం లో జరుగుతాయి. దీని ద్వారా ప్రతి నెల నాకు రూ. 12000/- నుండి 15000/ ల వరకు ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం వల్ల మా కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాను. మా పిల్లలను మంచి స్కూల్‌ లో చదివిస్తున్నాను.” అని సంతోషంగా చెప్పిందిభారతమ్మ.

bharatamma

bharatamma


నెలకు 22వేల ఆదాయం
” పల్లె సమగ్ర సేవా కేంద్రం మా జీవితాన్ని మార్చింది…” అంటారు,వికారాబాద్‌జిల్లా, పరిగి గ్రామానికి చెందిన మాధవి.
” నేను సాయి గణేష్‌ మహిళా పొదుపు సంఘంలో సభ్యురాలిని. డిగ్రీ వరకు చదువుకున్నాను. ముగ్గురు పిల్లలు. భర్త కు మొబైల్‌ షాప్‌ ఉంది . అయితే ఒక్కరి సంపాదనతో మా కుటుంబం గడవడం చాల కష్టంగా ఉండేది.
పరిగి మహిళా సమాఖ్య నుండి స్త్రీనిధి బ్యాంకు తరపున పల్లె సమగ్ర సేవా కేంద్రం ( వి.యల్‌ .ఇ) నిర్వహించే అవకాశం దొరికింది.

madhavi

madhavi


మా గ్రామా పంచాయితీ లో నే ఒక గదిలో ఈ సేవాకేంద్రం నిర్వహిస్తున్నాం. మా గ్రామంలో 130 సంఘాలు ప్రతి నెలా రూ. 27,00,000/- మా కేంద్రం లోనే పొదుపులు మరియు బ్యాంకు లోను చెల్లిస్తున్నారు. అన్ని రకాల లావాదేవీలు కలిపి రూ. 75,00,000/- జరుగుతాయి. దీనితో పాటు ‘ మీ సేవ’ కూడా ప్రజలకు అందిస్తున్నాము . ఈ పనుల ద్వారా నెలకు రూ. 16,000 నుండి రూ.22,000/-వరకు సంపాదిస్తున్నాను. మా కుటుంబం ఆర్థికంగా స్థిరపడింది. నా భర్తకు ఆర్థికంగా సహాయ పడుతున్నందుకు సంతోషంగా ఉంది.”
బండ పనులకు అండగా…
భర్త తాండూరు బండల పనుల్లో రెక్కలు ముక్కలు చేసుకుంటూ కష్టపడుతుంటే ఇంటర్‌ చదివిన రమణి తమ కుటుంబానికి తోడ్పాటు నివ్వడం లేక పోతున్నందుకు దిగులు పడేది. కానీ ‘స్త్రీనిధి’ అమెకో దారి చూపి,ఉపాధి కల్పించింది…
” నా భర్త పేరు ప్రవీణ్‌ కుమార్‌, వికారాబాద్‌ జిల్లా, తాండూర్‌ మండలం, కరణ్కోట్‌లో నివాసం.మాది నిరుపేద కుటుంబం. నా భర్త బండ గనుల్లో పనులకు వెళ్ళేవారు.నేను ఇంటర్‌ చదివి, ఒక ప్రవేటు స్కూల్‌ లో టీచర్‌ గా చేరగా నెలకు ర. 2,500/- ఇచ్చేవారు. అది ఏ మూలకు సరిపోయేది కాదు. ఇలాంటి సమయంలో ‘ స్త్రీనిధి బ్యాంకు ద్వారా పల్లె సమగ్ర సేవా కేంద్రం ( వి.యల్‌ .ఇ ) నిర్వహించడానికి అవకాశం లభించింది.
ఈ వి.యల్‌ .ఇ ద్వారా నెలకు 1,200 నుండి 1,600 వరకు బ్యాంకు లావా దేవీలు జరుగుతాయి. ఈ సేవలకు ప్రతి నెలా రూ. 10,000/- లనుండి, రూ. 13,000/ ల వరకు ఆదాయం వస్తుంది. గ్రామ ప్రజలకు బ్యాంకు సేవలు అందిస్తున్నందుకు చాలాఆనందంగా ఉంది.” అని ఆనందంగా చెప్పింది రమణి .

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *