నవ్య దిశగా….’ ఏక లవ్య ‘

Google+ Pinterest LinkedIn Tumblr +

నవ్య దిశగా….’ ఏక లవ్య ‘
స్కూలంటే… నాలుగు గదులు,నల్లబోర్డు, పైన కప్పు కాదు,
రేపటి సమాజాన్ని నిర్మించే అద్బుత ప్రయోగశాల. ఎవ్వరు పట్టించుకోకుండా పోతున్న ప్రభుత్వ బడుల పరిస్ధితి ఏకలవ్యఫౌండేషన్‌ని కదిలించింది. సమస్యలకు కారణాలను అనేక కోణాల్లో విశ్లేషించారు. ఆ సమస్యలేవీ పరిష్కరించ లేనంత క్లిష్టమైనవి కావు.కావాల్సింది ఒక సమష్టి తత్వం. అందుకే అందరూ కలిసి ముందడుగు వేశారు. పుస్తకాలు కొనలేని వారికి నోట్‌ బుక్స్‌,స్టేషనరీ ఉచితంగా అందించారు.

‘Poor’ students of government schools to get books, bags @kadapa

‘Poor’ students of government schools to get books, bags @kadapa

వాటిని కాపాడుకోవడానికి 5వేల మందికి స్కూల్‌ బ్యాగ్‌లు కూడా ఇచ్చారు.. ఆ కార్యక్రమంలో రూరల్‌మీడియా కూడా పాల్గొంది. అలా మొదలైన విద్యా సేవ… కడపలో ప్రతీ సర్కారీ స్కూల్‌ గడపకు చేరబోతుంది… మురికివాడల్లో సాయంత్రపు పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ అక్షర యజ్ఞంలో ఏకలవ్యఫౌండేషన్‌ జిల్లా ప్రతినిధి శ్రీనివాస ప్రసాద్‌ నిరంతరం కృషి చేస్తూ పేద చిన్నారుకు అండగా ఉన్నారు.
కడపలో పేద బిడ్డలకు స్కూల్‌బ్యాగులు ఇవ్వడం.. ఈ ఏడాది సంతోషం కలిగించిన ఓ గొప్ప గొప్ప ముచ్చట.

Pic/k.rameshbabu/ruralmedia

Share.

Leave A Reply