శ్రీసిటీ ఫౌండేషన్ కు జాతీయ పురస్కారం

xiaomi_factory in sricity

సి.యస్.ఆర్ oగంలో చేస్తున్న సేవలకు గుర్తింపుగా

శ్రీసిటీ ఫౌండేషన్ కు జాతీయ  పురస్కారం

శ్రీసిటీ, సెప్టెంబర్ 22, 2917:- సి.యస్.ఆర్ రoగంలో చేస్తున్న సేవలకు గుర్తింపుగా శ్రీసిటీ ఫౌండేషన్ కు ‘నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ఇన్ సి.యస్.ఆర్’ పురస్కారం లభించింది. బెంగుళూరులో గురువారం సాయంత్రం ‘నేషనల్ సి.యస్.ఆర్ లీడర్షిప్ కాంగ్రెస్’ ఆధ్వర్యంలోజరిగిన కార్యక్రమంలో, మై బ్రైన్ ఇంటర్నేషనల్, సంచాలకులు అలిస్టైర్ స్కొఫీల్డ్ చేతులమీదుగా శ్రీసిటీ ఫౌండేషన్ అద్యక్షులు రమేష్సుభ్రమణ్యం ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

Mr. Ramesh Subramaniam (right in the photo) receiving the citation and trophy from Mr. Alistair Schofield.

Mr. Ramesh Subramaniam (right in the photo) receiving the citation and trophy from Mr. Alistair Schofield.

అరుదైన పురస్కారం లభించినందుకు సంతోషం వ్యక్తంచేసిన శ్రీసిటీ నిర్వాహక సంచాలకులు రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ,ఒక ప్రాంతం యొక్క సాంఘిక, ఆర్ధిక పరిస్థితులను, ఒక సెజ్ విధంగా ప్రభావితం చేసి, ఆ ప్రాంత ప్రజల జీవనస్థితిగతులను ఏవిధంగా మెరుగు పరచగలదన్నదానికి నిలువెత్తు నిదర్శనం శ్రీసిటీ అని, శ్రీసిటీ పౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టినసమగ్ర గ్రామాభివృద్ధి కృషికి   జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినందుకు ఆనందంగా వుందన్నారు.  మన దేశంలో  సి.యస్.ఆర్ రంగంలో మంచి సేవలందించే సంస్థలకు, వ్యక్తులకు ప్రోత్సాహానిచ్చేందుకు, జాతీయ స్థాయిలో గుర్తింపుతెచ్చేందుకై , నేషనల్ సి.యస్.ఆర్ లీడర్షిప్ కాంగ్రెస్, ఏషియన్ కన్ఫెడరేషన్  ఆఫ్ బిజినెస్ సహకారంతో వార్షిక పురస్కారాలనుఅందిస్తున్నది. 2017 సం. పురస్కారం శ్రీసిటీకి లభించింది.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *