మనమంతా…

Google+ Pinterest LinkedIn Tumblr +

మనమంతా… 
సముద్రం ఎదురుగా ఎత్తయిన కొండమీది రామకృష్ణ పరమ హంస మందిరంలో కొన్ని నిముషాలు ధ్యానం చేసి కళ్లు తెరిస్తే సమాజం కొత్తగా కనిపించింది. మందిరం మెట్లు దిగి కిందనున్న ఆశ్రమంలోకి వెళ్లగానే స్వామి ఆత్మవిదానంద నవ్వుతూ పలకరించారు. ”మీ గురించి మోహనయ్యగారు చెప్పారు. మా సంకల్పంలో మీరు భాగస్వాములవుతారా? ” అంటూ ల్యాప్‌ ట్యాప్‌ ఓపెన్‌ చేసి, తాగునీరు, విద్యుత్‌, రహదారులు లేని కొన్ని గ్రామాలను చూపించారు. 

Ruralmedia wants helping hand for Araku Tribals

Ruralmedia wants helping hand for Araku Tribals


” మాకు అవకాశం ఉన్న మేర 250 గ్రామాలకు సోలారు వెలుగులు, 10 గ్రామాలకు తాగునీరు రామకృష్ణామిషన్‌ ద్వారా అందించాం. దీని వల్ల అక్కడ వచ్చిన మార్పును మీరు డాక్యుమెంట్‌: చేయాలి. ” అన్నారు. 
ఇది జరిగిన నెల తరువాత 28పేజీల రిపోర్ట్‌ స్వామిజీ చేతిలో ఉంచాను. 
ఇటీవల ఆ పుస్తకాన్ని  General secretary Rev Sw Suhitanandaji ఆవిష్కరించారు. నేను మరో ఫీల్డ్‌ విజిటిలో ఉండటం వల్ల ఆ కార్యక్రమానికి వెళ్ల లేక పోయాను. మానవసేవే మాధవ సేవ లక్ష్యంతో ఏర్పడిన  అంతర్జాతీయ ధార్మిక సంస్ధతో కలిసి పనిచేయడం మాకు అద్బుతమైన ఇన్సిపిరేషన్‌.

Share.

Leave A Reply