స్మార్ట్‌ విలేజీలు కావాలి….

creda-520x245

స్మార్ట్‌ విలేజీలు కావాలి…. 
ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘రైతునేస్తం’ పురాస్కారాల కార్యక్రమానికి నాబార్డు మాజీ సిజిఎం పాలాది మోహనయ్యగారు అధ్యక్షత వహించారు. 

 


” రసాయన ఎరువుల లేని ప్రకృతి వ్యవసాయం మనకు కావాలి. సుబాష్‌ పాలేకర్‌ వ్యవసాయ విధానం పట్ల మన రైతులు ఆసక్తి చూపిస్తున్నారు కానీ వ్యవసాయ శాస్త్రవేత్తలు దీనిని అంగీకరించడానికి వెనుకంజవేస్తున్నారు.వీరిలో మార్పు తెచ్చే దిశగా ప్రభుత్వం ప్రయత్నించాలి.
రైతులకు మార్కెట్‌,స్టోరేజీ సౌకర్యాలు లేక పోవడం రైతుల నష్టపోవడానికి కారణం. వీటిని మెరుగు పరిచేలా సమగ్రమైన ప్రయత్నాలు జరగడం లేదు. ధర్మో రక్షతి…లాగే వ్యవసాయాన్ని మనం రక్షించుకుంటే ,వ్యవసాయం వల్ల మనం రక్షించ బడతాం… రైతులను అతివృష్టి,అనావృష్టి నుండి కాపాడడానికి వాటర్‌షెడ్‌లను ఏర్పాటు చేసుకోవాలి.
మన రైతులకు నాబార్డు,ఐసిఆర్‌ఎ లాంటి సంస్థలివ్వాల్సిన అవార్డులను ‘ రైతునేస్తం’ వెంకటేశ్వరరావు ఇవ్వడం అభినందనీయం. గౌరవనీయ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు గారు ఇక్కడే ఉన్నారు. దేశమంతటా వారు స్మార్ట్‌ సిటీలు అభివృద్ది చేసే గొప్ప ప్రయత్నం చేస్తున్నారు. వాటితో పాటే స్మార్ట్‌విలేజీల గురించి కూడా ఆలోచించాలని మనవి చేస్తున్నా…’ అన్నారు మోహనయ్యగారు.

Related posts