రూరల్‌మీడియాకి ‘ రైతునేస్తం అవార్డు’

Google+ Pinterest LinkedIn Tumblr +

గ్రామీణ పాత్రికేయానికి రైతునేస్తం మీడియా అవార్డు
రూరల్‌మీడియాది చాలా చిన్న ప్రపంచం.
గ్రామీణ జీవితాన్ని కాస్త ఓపెన్‌గా విశాల దృష్టితో చూపించాం, కొంచెం ప్రత్యామ్నాయంగా ఆలోచించాం అంతే… మా కృషికి ‘ రైతునేస్తం’ మీడియా అవార్డు ప్రకటించారు.
మట్టిలో బతికే బంగారు మనుషుల మధ్య, కృష్ణాజిల్లా, మారుమూల గ్రామం(ఆత్కూరు)లో ఈ అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగాఉంది. కర్షక కుటుంబ నేపథ్యం నుండి ఎదిగిన భారత  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతులు మీదుగా, తెలంగాణ.ఆంధ్ర వ్యవసాయ శాఖ మంత్రులు పోచారం శ్రీనివాస రెడ్డి,సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి,రైతునేస్తం వెంకటేశ్వరరావు,కోటి మొక్కలు నాటిన వనజీవి రామయ్య సమక్షంలో, మీడియా మిత్రుల మధ్య ఈ కార్యక్రమం ఆహ్లాదంగా జరిగింది. (3.10.2017)

news-clip

news-clip

Share.

Leave A Reply