సౌర వనంలో విహరిస్తారా?

India One Solar Thermal power Plant - Brahma Kumaris at Rajastan by shyammohan

సౌర వనంలో విహరిస్తారా?
సూర్యుడు అస్తమించని చోటు ఇది.ఇక్కడ నిరంతరం సూర్య కిరణాలుంటాయి. వాటిని ఇంధన శక్తిగా మార్చి విద్యుత్‌కు ఆల్టర్‌నేటివ్‌గా వాడుతున్నారు. 55 ఎకరాల్లో 770 సోలార్‌ రిఫ్లెక్టర్లు అమిర్చి విద్యుత్‌ను సృష్టిస్తున్నారు.రోజుకు 16 గంటలు విద్యుత్‌ సరఫరా చేయడానికి సరిపడా సూర్యరశ్మిని నిలువ చేసుకునే అత్యాధునిక టెక్నాలిజీని జర్మనీ సమకూర్చింది.

Shyammohan at Solar Thermal power Plant, rajastan

Shyammohan at Solar Thermal power Plant, rajastan

ఐక్యరాజ్య సమితి సహకారంతో జర్మన్‌ టెక్నాలిజీతో ఏర్పాటయిన ఈ సౌర వనంలో గంటకు ఒక మెగావాట్‌ విద్యుత్‌ ఉత్పత్తవుతుంది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.75కోట్లు.
బ్రహ్మకుమారీస్‌ నిర్వహిస్తున్న ఈ సొలార్‌ ధర్మల్‌ ప్రాజెక్టు వల్ల ఉత్పత్తవుతున్న విద్యుత్‌తో ప్రతీ రోజు 15000 మందికి సరిపడా వంట చేస్తున్నారు. మరో ఆరు నెలల్లో పూర్తి స్ధాయిలో ఉత్పత్తి మొదలవుతుందని ఇక్కడి గైడ్‌ లింగప్ప చెప్పారు.
ఆబూ రోడ్‌ లో ఉమార్ని గ్రామంలో(రాజస్ధాన్‌) ఉన్న ఈ సొలార్‌ ధర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఇండియాలో మొదటిది.

– shyammohan, from Rajastan

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *