చిన్నారులను కాపాడే చిరు ప్రయత్నం ఇదిగో

Bore Well Recharge - How it is done?

చిన్నారులను కాపాడే చిరు ప్రయత్నం ఇదిగో
చిన్నారులకు రక్ష, బోర్లకు జలకళ
నిరుడు శాన్వి, మొన్న మీనాలను బోరుబావులు మింగేసిన విషాదం మరిచిపోతున్నాం కానీ సమస్య మాత్రం అలాగే ఉంది. దీని పై చాలా మంది రైతులను మేం కదిలించినపుడు మాకు తెలిసిందేమంటే, ఎప్పటికైనా నీళ్లు పడతాయనే అశతో వాటిని మూయకుండా వారు వదిలేస్తున్నారు.
నీళ్లు పడని బోరు బావులను అలా నిర్లక్ష్యంగా వదిలేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలను రైతులు అనుసరిస్తే ప్రమాదాలను అరికట్టడమే కాక ఎండిన బోరులో జలమట్టం పెరుగుతుంది.
ఒక్కో బోరుబావి సుమారు 150 నుండి 300 అడుగుల లోతు ఉంటుంది.
ఆ బావుల అంచులు కూలి పోకుండా గొట్టాలు అమర్చి,ప్రమాద రహితంగా వాటిని తీర్చిదిద్దాలి. ఆ పై వాన నీరు వాటిలోకి చేరేలా ”బోర్‌ వెల్‌ రీచార్జి ” పనులు చేసుకుంటే భూగర్భ జలాలు పెరిగి ఎండిన బోరులో నీరు చేరుతుంది. కరీంనగర్‌ జిల్లాలో ఎండిన బోర్లను పునరుద్దరించిన వైనం పై rural media తీసిన డాక్యుమెంటరీ ఇది must watch this video  దీని వల్ల చిన్నారులను కాపాడుకోవడంతో పాటు బోర్లను పునరుద్దరించ వచ్చు.
మీ ఎండిన బోర్లకు జలకళ కావాలంటే రూరల్‌మీడియాను సంప్రదించండి(ruralmedia30@gmail.com)

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *