సవర తెగలో చైతన్యం

Savara Tribal village gets a new ray of hope

సవర తెగలో చైతన్యం
విజయ నగరం నుండి బొబ్బిలి మీదుగా జంజావతి రబ్బర్‌ డ్యామ్‌ దాటుకొని నూటనలభై కిలోమీటర్లు వెళ్తే ఒరిస్సా సరిహద్దుల్లోని గిరిజనగూడెమే లక్కగూడ. 900 సవర తెగ ఆదివాసీలు జీడిమామిడి,జొన్నలు సాగు చేసుకొని బతుకుతున్నారు.అభివృద్దికి దూరంగా విసిరేసినట్టున్న ఈ పల్లెలో అక్షరమే ఆత్మవిశ్వాసంగా ఎదిగిన మహిళ కళావతి కడ్రగ. ఇక్కడే తన ఇద్దరు బిడ్డలను చదివించి,ఉద్యోగాల్లో స్ధిరపడేలా చేసింది. నేడు గ్రామ సర్పంచ్‌గా తన గ్రామాభివృద్దికి క్షణం తీరిక లేకుండా శ్రమిస్తోంది.

సర్కారీ అధికారులతో పోరాడి తమకు అందాల్సిన సంక్షేమ పథకాలను సాధించే ప్రయత్నంలో టాయిలెట్స్‌ని ఏర్పాటు చేసి,సిసిరోడ్లు నిర్మించింది.ప్రజల భాగస్వామ్యంతో చెక్‌డ్యాంలు, చెరువుల్లో పూడిక తీసి వాన నీటిని ఒడిసి పట్టారు.” పని కల్పించడం ప్రాథమిక హక్కు. లక్కగూడలో 300మందికి ఉపాధి హామీ జాబ్‌కార్డులున్నారు. మరి కొందరికి త్వరలో వస్తాయి. అందరికీ తాగునీరు,విద్య, వైద్యం లక్ష్యంగా పని చేస్తున్నాం ‘ ‘ అంటారు ఆమె.

  • Shyammohan/Lakkagudaa/Vizayanagaram district/AP

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *