గట్టిగా అనుకుంటే అవుతుంది…

Changing the lives of women weavers

కేటీఆర్‌ గట్టిగా అనుకుంటే అవుతుంది…
ఈ రోజు జాతీయ చేనేత ఉత్సవాన్ని సమంతా ఫ్యాషన్‌ షోలతో, చేనేత నడకలతో చాలా సందడిగా చేసుకొని మర్నాడు మరో ఈవెంట్‌ లో మునిగి పోతాం.
కానీ నేతన్నకు మాత్రం ఇరవైనాలుగుగంటలూ మగ్గం ముందు రెక్కాడితే కానీ డొక్కాడదు. ఇక్కడున్న నేతమ్మ తనకంటే ఎత్తయిన రాట్నాన్ని రోజంతా తిప్పితే రూ,200 కూడా గిట్టుబాటు కాదు.. ఇలాంటి చేనేత కార్మికులు తెలంగాణాలో1,20,440 మంది ఉన్నారు. వీరికి పని కావాలి. వారు నేసిన వస్త్రానికి గిట్టుబాటు ధర కావాలి. వారి చెమటని దోచుకుంటున్న దళారీ వ్వవస్ధను తప్పించాలి.వారు అప్పులు ,ఆత్మహత్యలులేకుండా సంతోషంగా ఉండాలి. ఇదంతా సాధ్యమా? సర్కారుకి చేనేతను కాపాడుకోవాలనే చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే ఖచ్చితంగా సాధ్యమవుతుందని ‘రూరల్‌ మీడియా’ గణాంకాలతో సహా రుజువు చేస్తోంది.
1, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నిరకాల ఆసుపత్రుల్లోని పడకల సంఖ్య 20389.వీటికి చేనేత వస్త్రాలనే వాడాలి.
2, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధుల సంఖ్య 60,60,008,ఎస్సీ,ఎస్టీ,బీసీ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు 236405,ఇక రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో విద్యార్ధులు138794.వీరందరికీ నేత దుస్తులే యూనీఫామ్స్‌ గా వాడాలి.
3, రాష్ట్రవ్యాప్తంగా 28669మంది అంగన్‌ వాడీ కార్యకర్తలున్నారు.వారు కూడా తెలంగాణ నేత కార్మికుల నేసిన దుస్తులే వాడాలి.ఆర్టీసీ బస్సు సీట్లకు కూడా నేత వస్త్రాలే వాడాలి.
ఈ కార్యక్రమాలను యువమంత్రి, నవీన భావాలున్న,ఆలోచనపరుడైన కేటీఆర్‌ గారు ఖచ్చితంగా అమలు చేస్తే నేత కార్మికులు ఆర్డర్లు కోసం వెతుక్కోనక్కర లేదు. ఐటీ ఉద్యోగులకంటే ఎక్కువ ఆదాయం వస్తుంది.దీంతోపాటు టెక్నాలజీని అందించి,ప్రతీ నేత కార్మికుడిని సమర్ధ మానవ వనరుగా తీర్చిదిద్దుకునే సమర్ధవ్యూహాలతో ప్రభుత్వం చేనేత విధానాలను రూపొందిస్తే బంగారు తెలంగాణాను భావి తరమే నిర్మించుకుంటుంది. దేశవ్యాప్తంగా చేనేత అభివృద్ధికి ఒక మార్గం ఏర్పడుతుంది.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *