కంది సాగులో కొత్త ప్రయోగం

Google+ Pinterest LinkedIn Tumblr +

కంది సాగులో కొత్త ప్రయోగం
నిన్న…
వికారాబాద్‌ జిల్లాలో 1,65,202 మంది రైతులు వర్షాధారం పై వ్యవసాయం చేస్తున్నారు. 1,91,597 మంది రైతు కూలీలకు పని దొరుకుతోంది. ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం రైతులు 43,428 హెక్టార్లలో కందులు పండిస్తున్నారు. అనావృష్టి,అతి వృష్టి వల్ల ఎకరానికి 2నుండి 3 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తోంది. ఇదంతా నిన్నటి నేపథ్యం
నేడు…
ఈ పరిస్ధితిని మార్చే అవకాశాలు, కంది దిగుబడి పెంచే మార్గాలు కోసం, వ్యవసాయి నిపుణులు, రైతులతో ‘రూరల్‌మీడియా’ టీం మాట్లాడింది. ECOART (తాండూర్‌)లో 17.10.2017న జరిగిన చర్చల్లో కంది సాగులో దశాబ్దాల అనుభవం ఉన్నస్థానిక రైతులు రవీందర్‌(జిన్‌గుర్తి), ద్వావరి నారాయణ(రుద్రారం),వడ్లబ్రహ్మచారి, (ఆత్కూరు) సూచనలు… విత్తనాల ఎంపిక నుండి ఎండుతెగుల నివారణ వరకు అగ్రి నిపుణులు సుబ్రహ్మణ్యం(హైదరాబాద్‌),రమాకాంత్‌(జిన్‌గుర్తి) చెప్పిన పరిష్కారాలు రికార్డు చేశాం.
రేపు….
దిగుబడిని రెట్టింపు చేసి, కంది సాగులో వినూత్నమైన ఫలితాలు సాధించడానికి ఒక నూతన ప్రయోగం వికారాబాద్‌ జిల్లా వ్యవసాయ క్షేత్రాల్లో జరగ బోతుంది.రైతుల్లో అవగాహన కలిగించడానికి అవసరమైన బుక్‌లెట్‌, షార్ట్‌ ఫిలిం త్వరలో రాబోతున్నాయి.

kisanmitra- poster

kisanmitra- poster

Share.

Leave A Reply