కొండ కింద నీటి చెలమ

Rocky land now an Mango orchard

కొండ కింద నీటి చెలమ
…………………………
చుట్టూ కొండల మధ్య ఐదుగురు రైతులకు ఏడెకరాల బీడుభూమి బండరాళ్లు, ముళ్ల పొదలతో ఉండేది. విత్తు వేద్దామని దున్నితే రాళ్లు బయట పడేవి. సాగు చేయలేక ఇతర రైతుల దగ్గర కూలీకి పోయే వారు. సొంత భూమి ఉండి కూడా ఇలా ఎంత కాలం బతకాలి…? అని అందరూ ఒక రోజు కలిసి పలుగు,పార పట్టి రెండు పంట కుంటలను తవ్వి కొండ వాలులో కురిసిన వాన నీటిని వాటిలోకి మళ్లించారు.
ఉపాధి హామీ పథకంతో భూమిని సాగుకు యోగ్యంగా మార్చి, ఐదువందల మామిడి మొక్కలు నాటారు. గొడియాడ గ్రామం ( విజయనగరంజిల్లా) దాటి ఈ కొండ కిందికి దిగితే రాళ్ల మధ్య ఉద్యాన వనం,దాని పక్కన నీటి చెలమలను సృష్టించిన రమణమ్మ, అక్కు నాయుడు, డోకల కృష్ణుడు తోటకు నీరు పెడుతూ చిర్నవ్వుతో పలకరిస్తారు.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *