
రైతుకు…రుణ విమోచన ?
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు రుణమాఫీ పథకం చెల్లింపులు రెండో విడత పూర్తయ్యాయి. మొత్తం రెండో విడతలో 36,39,553 మంది రైతులకు గాను 3002.55 కోట్ల రూపాయల మేర రైతులకు రుణవిముక్తి కలిగింది. రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడ్డ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ… రైతన్నలను కష్టాల నుంచి బయటపడేసేందుకు రెండో విడత రుణమాఫీ చేశారు. రైతుల మిగతా మొత్తాలకు రుణవిమోచన పత్రాలను అందజేశారు. అత్యధికంగా గుంటూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో1246.88 కోట్ల రూపాయల మేర రుణమాఫీ జరిగింది.
ఇక జిల్లాల వారీగా చూస్తే… శ్రీకాకుళం జిల్లాలో రెండో విడత రుణమాఫీతో లక్షా 46 వేల 709కి ఉపశమనం లభించింది. పది శాతం వడ్డీతో కలుపుకొని రూ. 103.07 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది. ఇక విజయనగరం జిల్లాలో రెండో విడత రుణమాఫీలో 91,059 మంది రైతులకు రూ. 62.87 కోట్ల రూపాయల రుణఉపశమనం లభించింది. ఇక విశాఖపట్టణం జిల్లాలో రెండో విడత రుణమాఫీలో లక్షా 583 మంది రైతులకు రూ. 79.28 కోట్ల రూపాయల మేర రుణ విముక్తి కలిగింది. తూర్పు గోదావరి జిల్లాలో 2,49,712 మంది రైతులకు రూ.175.23 కోట్ల రూపాయల రుణఉపశమనం లభించింది. పశ్చిగోదావరి జిల్లాలో 3,35,456 మంది రైతులకు గాను రూ. 262.33 కోట్ల రూపాయల రుణవిముక్తి కలిగింది. కృష్ణా జిల్లాలో 2,96,324 మంది రైతులకు రూ.232.11 కోట్ల రూపాయలు రుణ విమోచన జరిగింది. గుంటూరు జిల్లాలో రెండో విడత రూ. 486.47 కోట్ల రూపాయలతో 5,23,321 మంది రైతులు లబ్ధి పొందారు. ఇక ప్రకాశం జిల్లాలో 3,67,888 మంది రైతులకు గాను రూ. 343.74 కోట్ల రూపాయల మాఫీ జరిగింది. ఇక శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో లక్షా 93 వేల 3 ఎకౌంట్లకు గాను రూ.154.65 కోట్ల రుణవిమోచన లభించింది. చిత్తూరు జిల్లాలో 2,66,312 మంది రైతులకు రూ.228.50 కోట్ల రుణవిముక్తి కలిగింది. వైఎస్సార్ కడప జిల్లాలో 2,54,317 మంది రైతులకు రూ.205.69 కోట్ల రుణవిముక్తి కలిగింది. ఇక అనంతపురం జిల్లాలో రూ. 416.67 కోట్ల రూపాయలతో 5,45,759 మంది రైతులకు లబ్ధి కలిగింది. కర్నూలు జిల్లా విషయానికి వస్తే 2,70,110 మంది రైతులకు రూ.251.94 కోట్ల రూపాయల రుణవిమోచన లభించింది. మొత్తం రెండో విడతలో 36,39,553 మంది రైతులకు గాను 3002.55 కోట్ల రూపాయల రుణవిమోచన లభించింది. ఇక మొదటి విడతలో రైతులకు మొత్తం 54,98,142 మంది రైతులకు రూ. 7,564.69 కోట్ల రుణవిమోచన లభించింది. ఇక రూ. 50 వేల వరకు 18లక్షల 58 వేల 589 మంది ఒకేసారి రుణవిమోచన పొందారు.
మొదటి విడత చెల్లింపు | రెండో విడత చెల్లింపు | ||||
S.No | జిల్లా | మొత్తం ఎకౌంట్లు | రూపాయలు కోట్లలో | రెండో విడత చెల్లించిన ఎకౌంట్లు | చెల్లించిన మొత్తం |
1 | శ్రీకాకుళం | 296510 | 410.86 | 146709 | 103.07 |
2 | విజయనగరం | 215719 | 316.97 | 91059 | 62.87 |
3 | విశాఖపట్టణం | 216712 | 325.03 | 100583 | 79.28 |
4 | తూర్పు గోదావరి | 461701 | 626.08 | 249712 | 175.23 |
5 | పశ్చిమ గోదావరి | 493121 | 640.22 | 335456 | 262.33 |
6 | కృష్ణా | 444985 | 580.44 | 296324 | 232.11 |
7 | గుంటూరు | 667243 | 931.18 | 522321 | 486.47 |
8 | ప్రకాశం | 459385 | 602.55 | 367888 | 343.74 |
9 | పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా | 282472 | 398.02 | 193003 | 154.65 |
10 | చిత్తూరు | 370682 | 516.92 | 266312 | 228.50 |
11 | వైస్సార్ కడప జిల్లా | 352060 | 465.14 | 254317 | 205.69 |
12 | అనంతపురము | 806722 | 1063.47 | 545759 | 416.67 |
13 | కర్నూలు | 430830 | 687.81 | 270110 | 251.94 |
మొత్తం | 5498142 | 7564.69 | 3639553 | 3002.55 |
జిల్లాల వారీగా రైతు రుణవిమోచన పథకం