వృక్ష మిత్రుడికి ‘ప్రకృతిరత్న’

Ramaiah, a green crusader

వృక్ష మిత్రుడికి ‘ప్రకృతిరత్న’
మనం తిని పారేసిన పండ్ల గింజలను 30 ఏండ్ల క్రితం ఒక మానవుడు ఒక సంచిలోకి ఏరుకొని వానా కాలంలో ఈ రోడ్డుకు ఇరువైపులా నాటగా, ఇదో ఇలా పచ్చని పందిరి అల్లుకుంది.
పోయిన వేసంగిలో మండే ఎండల్లో ఖమ్మం నుండి తూర్పు దిశగా  15 కిలోమీటర్లు దూరంలో  రెడ్డిపల్లి దగ్గర ఈ చల్లని నీడలో సేద తీరాం. రోడ్డుకిరువైపులా పదికిలో మీటర్ల వరకు అల్లుకున్న ఈ పచ్చని చెట్లను  నాటి కాపాడి కొన్ని తరాలకు నీడనిచ్చిన ఆకుపచ్చని సూరీడు దరిపల్లి రామయ్య.

Ramaiah, a green crusader

Ramaiah, a green crusader

రోజూ వేలాది బాటసారులకు ప్రాణవాయువు పంచుతున్న రామయ్యను ‘రైతునేస్తం’ పత్రిక ‘ప్రకృతిరత్న’ అవార్డుతో సత్కరించడం పర్యావరణ హితుడికి లభించిన అరుదైన అద్భుత గౌరవం. వ్యవసాయ నిపుణుడు అలపాటిసత్యనారాయణతో పాటు ఉత్తమ రైతులు,శాస్త్రవేత్తలు,విస్తరణ అధికారులు కూడా రైతు నేస్తం పురస్కారాలు అందుకోబోతున్నారు.
పాత్రికేయులకు అవార్డులు
వైవిధ్య దిగుబడులతో విజయాలు సాధించిన రైతాంగం పై కథనాలు రాసిన ఈటీవీ,దూరదర్శన్‌, రూరల్‌మీడియా, సాక్షి, టీవీ5, టీవీ వన్‌ జర్నలిస్టులకు పద్మశ్రీ డా. ఐవీ సుబ్బారావు పేరిట పురస్కారాలు కూడా ప్రకటించారు.
అక్టోబర్‌ 3న కృష్ణాజిల్లా, అత్కూర్‌లోని స్వర్ణభారత్‌ ట్రస్టులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా ఈ అవార్డులు ప్రదానం చేస్తామని రైతునేస్తం ఎడిటర్‌ వై.వెంకటేశ్వరరావు వెల్లడించారు.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *