బొట్టు బొట్టు ఇంకితే, జలసిరులే పొంగితే…

Rain Water Harvesting in tribal village

నిజానికి నాకు…. ఆకు, పువ్వుకి తేడా తెలీదు.
కొండా,కోనల్లో కష్టజీవులు చిన్నచిన్న పనులతో సాధిస్తున్న పెద్ద విజయాలను,వారి వెలుగును మీతో పంచుకుంటున్నానంతే…
భద్రాచలం అడవుల్లోని చిన్న గ్రామంలో నాలుగెకరాల్లో మూడు పంటలు పండిస్తున్న భద్రయ్య జీవన చిత్రమిది. వీరి చుట్టూ చిన్నాపెద్దా గుట్టలున్నాయి. వర్షాకాలంలో అక్కడి నుండి జారే నీరే వీరి ఎవుసానికి అధారం. అయితే.. ఒక్కసారిగా పారే నీటికి ఎక్కడా అడ్డుకట్టలు లేకపోవడంతో నీరంతా దిగువకు వృథాగా పోయేది. రాతికట్టలు,పంట కుంటలు ,పొలం చుట్టూ ఎత్తయిన గట్లు వంటి చిన్న చిన్న పనులతో వాన నీటిని నేలలోకి ఇంకింప చేశారు. తక్కువ ఖర్చుతో చేసిన ఈ పనుల వల్ల ఎగువ నుంచి వచ్చే వర్షపు నీటిని తమ గ్రామంలోనే ఇంకిపోయేలా చేయడంతో, బోర్లలో నీటి మట్టం పెరిగింది. ఏడాదంతా… మిరప,కందులు, గోంగూర, కూరగాయలు పండిస్తూ ప్రతీరోజు పండుగ చేసుకుంటున్నారీ ఆదివాసీలు.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *